ఐపీఎల్ సీజన్ లో  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  అద్భుతంగా రాణిస్తూ ఉన్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా వరుస విజయాలు అందుకుంటూ  దూసుకుపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం అద్భుత ఫామ్ లో  ఉంటూ వరుసగా సెంచరీలు చేస్తూ ఎన్నో ప్రశంశలు అందుకొంటున్నారు ఐపీఎల్ ప్రారంభంలో అంతగా రాణించక పోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం పుంజుకుని అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత నాలుగు మ్యాచ్ లలో  రెండు మ్యాచ్ల్ లలో  హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్ మరో రెండు మ్యాచ్లు రెండు సెంచరీలు పూర్తి చేశాడు.



 ఐపీఎల్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు శిఖర్ ధావన్. శిఖర్ ధావన్ ఆట పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తున్న  విషయం తెలిసిందే. బౌలర్లకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా శిఖర్ ధావన్  ఆడుతున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట పేలవ ప్రదర్శన చేయడంతో ధావన్ స్థానంలో రహానేను ఆడించాలని సలహాలు కూడా తెరమీదకు వచ్చాయి. కానీ ఆ తర్వాత నాలుగు మ్యాచ్ లలో  శిఖర్ ధావన్ పుంజుకున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.



 అయితే తాను వరుసగా సెంచరీలు చేయడం పై ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శిఖర్ ధావన్. ఆరంభంలో తడబాటుతో  ఆడిన తాను ఢిల్లీ కాపిటల్ హెడ్  కోచ్  అయిన రికీ పాంటింగ్ తో మాట్లాడి సలహాలు తీసుకోవడం తనకు ఎంతగానో ఉపయోగపడిందని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఇక ఒక మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత తనలో  ఎంతగానో ఆత్మవిశ్వాసం పెరిగింది అని చెప్పుకొచ్చాడు  శిఖర్ ధావన్. దేవుడి దయవల్ల సెంచరీలు చేయగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు. తన జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఇక రికీ పాంటింగ్ ఇచ్చిన సలహాల కారణంగానే తాను సెంచరీలు చేయగలిగాను అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: