ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంతో విజయవంతమైన సారథిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే తనదైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టిస్తూ విజయాలను అందుకుంటూ కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాన్ని  సమన్వయం చేస్తూ జట్టును ఎంతో సమతూకంగా ముందుకు తీసుకెళుతున్నారు. అయితే నిన్న ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఏది విజయం సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ ఆడలేదు అన్న విషయం తెలిసిందే.


 దీంతో జట్టులో మరో కీలక ఆటగాడైనా పోలార్డ్  జట్టు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. ఇక రోహిత్ శర్మ కేవలం స్టేడియం లో కూర్చొని మ్యాచ్ వీక్షించాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై  ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ నిన్న మ్యాచ్ లో ఎందుకు ఆడలేదు అనే చర్చ కూడా మొదలయింది. గత ఆదివారం ముంబై ఇండియన్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠత మధ్య హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్ లు  జరిగి  క్రికెట్ ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే ఎంటర్టైన్మెంట్ అందించిన విషయం తెలిసిందే.



 అయితే ఈ మ్యాచ్ ఓటమి తర్వాత అవార్డు సెర్మని  ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రాలేదు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ ఆడలేదు. అయితే ఇంతకీ రోహిత్ శర్మ ఎందుకు దూరంగా ఉంటున్నాడు అన్న చర్చ మొదలయింది. అయితే గాయం కారణంగా నే రోహిత్ శర్మ ఆడటంలేదు అన్నది తెలిసిందే. అయితే గత ఏడాది మోకాలి గాయం కారణంగా బాధపడిన రోహిత్ శర్మ మళ్లీ ఆ గాయం తాలూకు పెయిన్స్  రావడంతో మ్యాచ్ కి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: