గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పూర్తిగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తాడు అని ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులందరికీ నిరాశే ఎదురైంది,  దాదాపు ఏడాదిన్నర పాటు కనీసం మైదానంలోకి కూడా అడుగు పెట్టలేదు మహేంద్రసింగ్ ధోని. తర్వాత ఎవరూ ఊహించని విధంగా 15వ తేదీన తన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో రాణించి మళ్లీ భారత జట్టులోకి రంగప్రవేశం చేసి టి20 వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషిస్తాడు అనుకుంటే మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు ఏంటి అని కొన్ని రోజుల వరకు షాక్ లోనే ఉన్నారు అభిమానులు.



 ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును  మళ్లీ ముందుండి నడిపిస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ధోని ఐపీఎల్ సీజన్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎంతో ఫిట్ గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి మాత్రం కనీసం వికెట్ల మధ్య పరుగులు తీయడానికి కూడా ఆపసోపాలు పడుతున్నాడు. దీంతో అడుగడుగునా ఐపీఎల్ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే ధోని త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.



 ధోని ఆడే చివరి ఐపీఎల్ సీజన్ ఇదే  అని టాక్ వినిపిస్తోంది  అయితే దీని వెనుక కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్య కాలంలో ఎంతోమంది ఆటగాళ్లకు ధోని తన జెర్సీ ని  బహుమతిగా ఇస్తూ ఉండడం... అంతేకాకుండా అందరికీ ఆటోగ్రాఫ్లు కూడా ఇస్తూ ఉండడమే ఇందుకు  కారణంగా తెలుస్తోంది. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో తన జెర్సీని  జోస్ బట్లర్ గిఫ్ట్ గా  ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ధోనీ తన జెర్సీ ని  పాండ్యా బ్రదర్స్ కు బహుమతిగా ఇచ్చాడు. ఇక మరికొంత మంది ఆటగాళ్లు ధోని  ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. దీంతో ధోనీ ఆడే లాస్ట్ సీజన్ ఈ  ఐపీఎల్ మాత్రమే అని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: