నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల  మధ్య హోరాహోరీ పోరు జరిగిన విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు  రెండు జట్లు కూడా ఎంతో హోరాహోరీగా తలపడ్డాయి. ముందుగా ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లు పంజాబ్ బ్యాట్స్మెన్లను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ ఓపెనర్లు మెరుపులు మెరిపించడంతో సన్రైజర్స్ ఎంతో సునాయాసంగా విజయం సాధిస్తుంది అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడం తో చివరికి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.



 అయితే అందరూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుస్తుందని పూర్తి ధీమాతో ఉన్నప్పటికీ అనూహ్యరీతిలో ఊహించని విధంగా 12 పరుగుల తేడాతో గెలుపొందింది పంజాబ్ జట్టు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు విషయాలను అలవాటు చేసుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తొలి సగంలో ఇలా చేయలేకపోయాం నిజం చెప్పాలంటే ఇప్పుడు మాటలు కూడా రావడం లేదు... ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తాను ఎంతో సంతృప్తికరంగా సంతోషంగా ఉన్నాను అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు.



 ఇక మా విజయంలో సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు. రెండు నెలల కాలంలో ఆటగాళ్లను పూర్తిగా తీర్చిదిద్ద లేకపోయినప్పటికీ మానసికంగా మాత్రం ఎంతో దృఢంగా మార్చడానికి అవకాశం ఉంటుంది అందుకే రాహుల్ వ్యాఖ్యానించారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లను తమ హెడ్ కోచ్  అనిల్ కుంబ్లే ఎంతో మానసికంగా కూడా దృఢంగా మార్చారు అంటూ చెప్పుకొచ్చాడు కె.ఎల్.రాహుల్. తాము మొదట బ్యాటింగ్ చేసిన సమయంలో పిచ్ ఎంతో కఠినంగా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను అంటూ తెలిపాడు కె.ఎల్.రాహుల్...160 పరుగులు చేస్తే సరిపోతుందని భావించినట్లు తెలిపాడు. ఆ తర్వాత తమ బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: