ధోనికి ఇదే ఆఖరి సీజనా.?
గెలుపు దాకా వచ్చి.. ఓడిపోయాం’

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం తన జెర్సీని జోస్ బట్లర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు.

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం తన జెర్సీని జోస్ బట్లర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలాగే ముంబైతో మ్యాచ్ అనంతరం పాండ్యా బ్రదర్స్‌కు కూడా తన ఏడో నెంబర్ జెర్సీని బహుకరించాడు. అంతేకాదు ఈ సీజన్‌లో పలువురు క్రికెటర్లు ధోని ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం చూస్తుంటే.. సీఎస్‌కే సారధికి ఇదే చివరి సీజన్ కావొచ్చునని ఫ్యాన్స్‌లో అనుమానాలు కలుగుతున్నాయి.

ఇందుకు మరో కారణం కూడా లేకపోలేదు. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఏడాది సీజన్‌లో చెన్నై అత్యంత పేలవ ఆటతీరును కనబరుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఘోర వైఫల్యాలను ఎదుర్కుంది. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత పొందలేక టోర్నీ నుంచి నిస్క్రమించింది. దీనితో తోడు ధోని ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని త్వరలోనే లీగ్ నుంచి తప్పుకుంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో చెన్నై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు...............
ఐపీఎల్‌ 13లో భాగంగా నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ పేలవ ఆటతీరు కనబరిచారు. ఇదిలా ఉంటే జట్టు ఓటమిపై మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

‘గెలుపుకు చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయినందుకు బాధగా ఉంది. పంజాబ్‌ను మా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. అంతేకాదు లక్ష్యచేధనలో శుభారంభం దక్కింది. కానీ ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోయాం. పంజాబ్ బౌలర్లు కొత్త బంతితో రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌ను మర్చిపోయి ముందుకు సాగుతాం” అని వార్నర్ పేర్కొన్నాడు. కాగా, నిన్నటి మ్యాచ్ ఓటమితో హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: