ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్టుగా ప్రస్థానాన్ని కొనసాగించింది  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అంతేకాదు ఇప్పటి వరకు ఏ జట్టు సాధించని  రికార్డులను కూడా సాధించింది. ఆడిన ప్రతి సీజన్లో కూడా ప్లే ఆఫ్ కు  అర్హత సాధించిన ఏకైక జట్టుగా ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో తన రికార్డును ఇప్పటికికూడా పదిలం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అంతే కాకుండా ఎక్కువ సార్లు ఐపీఎల్ ఫైనల్ కు చేరుకున్న జట్టుగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. కానీ ఈ సారి మాత్రం అంతా మారిపోయింది. ఫైనల్ కి వెళ్లడం కాదు కదా కనీసం ప్లే ఆప్ కి కూడా అర్హత సాధించలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.



 ఈసారి టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా రాణించి... కప్పు గెలుస్తుంది అని అభిమానులు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి మొదటి నుంచి ఎంతో పేలవ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు... వరుస ఓటములతో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటు వచ్చింది. కొన్ని కొన్ని మ్యాచ్లలో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది ఇక అంతలోనే పేలవ  ప్రదర్శన చేసి ఓటమి చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఎట్టకేలకు మునుపెన్నడూ లేనివిధంగా ప్లే ఆప్ కి అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.




 ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆప్ కు చేరడంలో విఫలం అయింది అని చెప్పవచ్చు. నిన్న ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్ లో  రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఎంతో అద్భుతంగా రాణించి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. ఐపీఎల్ సీజన్ లో ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ నిలవడం గమనార్హం. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్ లలో  మాత్రమే గెలిచి  పాయింట్ల పట్టికలో చివరన  ఉంది. మిగతా దేశాలతో పోల్చి చూస్తే కూడా రన్ రేట్ చాలా తక్కువగా ఉండడంతో చెన్నై నుంచి లీక్ దశ నుంచి వెనుదిరుగక  తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: