ప్రస్తుతం బిసిసిఐ ఎన్నో కఠిన నిబంధనల మధ్య ఐపీఎల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో  ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా  వైరస్ వ్యాధి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రతి ఏడాది ఐపీఎల్ టోర్నీ భారత్ లో జరిగేది కానీ ఈ ఏడాది కరోనా  వైరస్ వ్యాప్తి కారణంగా భారత్లో బిసిసిఐ ఐపీఎల్ నిర్వహించాలని అనుకున్నప్పటికీ వాయిదా పడుతూ వచ్చి చివరికి ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు కూడా బీసీసీఐ  ఇప్పటికే నిర్ణయించింది.


  అయితే ప్రస్తుతం ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ పోరులో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టు అంచనాలకు తగ్గట్లుగా ఆడుతూ మంచి విజయాలను సొంతం చేసుకుంటూ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నది . అయితే గత రెండు మ్యాచ్ ల నుంచి ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఆడటం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ గాయం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టుకు పోలార్డ్ రోహిత్ శర్మ ప్లేస్లో సారథ్యం వహిస్తున్నాడు.



 ఇదిలా ఉంటే ఐపీఎల్ టోర్నీ పూర్తవ్వగానే భారత జట్టు ఆటగాళ్లు అటు నుంచి అటే ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు బీసీసీఐ  సర్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఆటగాళ్లను కూడా ప్రకటించింది . ఆస్ట్రేలియా టూర్ లో వన్డే టెస్ట్ క్రికెట్ ఆడనుంది భారత జట్టు. అయితే ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు భారత తుది జట్టు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ గాయం బారిన పడిన కారణంగా అతని గాయంపై  మెడికల్ టీం పరిశీలిస్తుంది అంటూ బీసీసీఐ తెలిపింది.  అందుకే రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవడంపై ఇప్పుడే  ఆలోచన చేయలేమంటూ బీసీసీఐ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: