ప్రస్తుతం ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో మొదట వరుస పరాజయాలు చవి చూసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్,  జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టి ఎంతో సమర్థవంతంగా  జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. దీంతో వరుసగా దాదాపు ఐదు విజయాలు అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. దీంతో ప్లే ఆఫ్ ఆశలను మరింత సుగమం చేసుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. అయితే ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి అటే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసింది.




 ఇక ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా మూడు వన్డేలు మూడు టి20 లు నాలుగు టెస్టులు ఆడనుంది భారత జట్టు. ఇక దీనికి సంబంధించిన జట్టు వివరాలను కూడా బీసీసీఐ ప్రకటించింది. అయితే భారత జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు అని చెప్పాలి. ఇటీవల ఐపీఎల్ లో గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మకు భారత జట్టులో కూడా చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ టి20, వన్డేలో కెప్టెన్గా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ  . దీంతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ కు మంచి ప్రమోషన్ వచ్చినట్లు అయింది.



 ప్రస్తుతం ఐపీఎల్ 2020 లో అద్భుత ఫామ్ కొనసాగించిన కె.ఎల్.రాహుల్ ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారిస్తూ   595 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం వరుస విజయాలు సొంతం చేసుకుంటూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అయితే చాలా కాలం నుంచి ఎంతో నిలకడగా... అద్భుతం గా రాణిస్తున్న కేఎల్ రాహుల్... భారత క్రికెట్ జట్టులో మూడవ కీలక ఆటగాడిగా ఎదిగిన విషయం తెలిసిందే. జట్టులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తర్వాత మూడవ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు రాహుల్. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ గైర్హాజరు తో కేఎల్ రాహుల్ కు ప్రమోషన్ వచ్చి ఏకంగా వన్డే టి20 లకు వైస్ కెప్టెన్గా వ్యవహరించేందుకు  అవకాశం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: