ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన డేవిడ్ వార్నర్ ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఎంతో దిగ్గజ ఆటగాడిగా  ఎదిగిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్... ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా భారత్లోనే అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో టిక్ టాక్ ద్వారా భారతీయులకు ఎంతో దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా తెలుగు ప్రజలకు అయితే మరింత దగ్గర అయిపోయాడు.



 సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి కెప్టెన్సి వహిస్తూ తెలుగు ప్రజలలో ఒకడుగా  మారిపోయాడు డేవిడ్ వార్నర్. వార్నర్ ను అందరూ వార్నర్ బాయ్ అంటూ పిలుస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. అయితే నేడు డేవిడ్ వార్నర్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఎంతమంది బర్త్ డే  శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే వార్నర్ బర్త్ డే సందర్భంగా వార్నర్ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందాం. మాట్రవేలిలో  లోని హౌసింగ్ కమిషన్ ప్లాట్ లో నివసించిన వార్నర్.. బ్యాట్ కొనుగోలు చేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడట.


 తన తండ్రి ఒకానొక సమయంలో తనకు ఒక సాదా సీదా బ్యాట్ కొనిచ్చి ఎంతో జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడట. ఈ బ్యాడ్ విరిగిపోతే మరో బ్యాట్ కొనిచ్చేందుకు స్తోమత లేదు అని అర్థం చేసుకునే వార్నర్  ఆ బ్యాట్  ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. రెక్కాడితే గానీ డొక్కాడని  కుటుంబంలో జన్మించిన డేవిడ్ వార్నర్ చిన్నతనంలో బొమ్మలు కావాలి  తల్లిదండ్రులు అడిగినప్పుడు వాళ్లు  కొనివ్వలేదట.  కానీ చివరికి స్తోమత లేదని అర్థం చేసుకుని బొమ్మలు అడగడం మానేసాడు. చిన్నతనం నుంచి పేదరికం నుండి వచ్చిన  డేవిడ్ వార్నర్... తన పిల్లలను కూడా చిరు వ్యాపారుల తో సులబంగా కలిసిపోయేందుకు అనుమతిస్తూ ఉంటాడు. అది కాకుండా రాత్రి  3 గంటల  వరకు పనిచేసి ఉదయం ఏడు గంటలకు వెళ్లే వాడు అంతే కాకుండా వారాంతాల్లో పేపర్ డెలివరీ బాయ్గా కూడా పని చేసాడు. 1877 పరుగుల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: