ఐపీఎల్ 2020 సీజన్ లో  అంచనాలకు తగ్గట్టుగా ఆడకుండా ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ  జట్టు  గా కొనసాగిన  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లీగ్  దశ తోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. వరుస  ఓటమిని చవి చూడటం తో ప్లే ఆఫ్ అవకాశాలు  మొత్తం గల్లంతయ్యాయి. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ లీగ్  దశతో వెనుదిరగడం ఇదే మొదటి సారి అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా ఐపీఎల్ సీజన్ లో  లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వెను  తిరుగులేదు. ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్గా ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సరైన ప్రదర్శన చేయలేక అంచనాలను అందుకోలేక చివరికి ఓటమి చవి చూస్తోంది.



 12 మ్యాచ్లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్ లలో  విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. దీంతో చివరి స్థానానికి పరిమితమైంది లీగ్  దశలోనే నిష్క్రమించింది. ముఖ్యంగా ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి విమర్శల పాలు అయ్యింది  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. తుది జట్టు ఎంపిక నుంచి సీనియర్ ఆటగాళ్ల  ప్రదర్శన వరకు ప్రతి విషయంలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. యువ ఆటగాళ్లకు ధోని అవకాశం ఇవ్వకపోవడంపై ఎంతోమంది మాజీలు ఘాటుగానే స్పందించిన విషయం తెలిసిందే.



 అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రాబోయే 2021 సీజన్కు చెన్నై టీం లో ఎన్నో మార్పులు చేసే అవకాశం ఉంది అన్న ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది  ముఖ్యంగా ధోని ని  కెప్టెన్సీ నుంచి తప్పిస్తారు అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రచారానికి చెక్ పెట్టే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్  క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ 2020 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కీ కెప్టెన్ ధోనీ ముందుకు  నడిపిస్తాడు అని మాకు నమ్మకముంది... చెన్నై జట్టుకి ధోని 3 ఐపీఎల్ టైటిల్స్ ని అందించాడు..  తొలిసారి ప్లే ఆప్ కి అర్హత  సాధించలేకపోయింది... ఐపీఎల్ చరిత్రలో ఏ  జట్టు కూడా ఆడిన ప్రతి సీజన్లో కూడా అర్హత సాధించలేదు. ఇప్పుడు ఏదో ఒక సీజన్లో విఫలం అయినంత మాత్రాన అన్ని మార్చేస్తారు అనుకోవడం పొరపాటు అంటూ కాశీవిశ్వనాథన్  స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: