ఐపీఎల్ టోర్నీ ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందనేది ఎవ్వరి  కూడా ఊహకందని విధంగా ఉంది.  అయితే ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ అంతగా మజా  ఇవ్వదు అని అనుకున్న ప్రేక్షకులందరికీ అంతకుమించి అనే రేంజ్ లోనే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది ఐపీఎల్. ఈ క్రమంలోనే నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పూర్తిగా ఎంతో  ఉత్కంఠభరితంగా సాగి పోయింది. అయితే ఈ మ్యాచ్ లో ప్రేక్షకుల అంచనాలన్ని  తారుమారు అయ్యాయి.



 సాధారణంగా అయితే ఐపీఎల్ ప్రారంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఎక్కడా వెనుదిరిగి చూడకుండా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నది . ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే మొదటి నుంచి పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. కొన్ని కొన్ని సార్లు చేతులారా మ్యాచ్ ఓడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో నిన్న జరిగిన మ్యాచ్ లో తప్పని సరిగా ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలన్నీ తారు మారు అయ్యాయి.



 వరుస విజయాలతో దూసుకుపోతున్న  ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది సన్రైజర్స్ జట్టు. అది కూడా సాదాసీదా విజయం కాదు ఏకంగా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఇందులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ మంచి ఇన్నింగ్స్ ఆడగా కొత్తగా జట్టులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా చెలరేగి ఆడి జట్టుకు భారీ స్కోరు వచ్చేలా చేశాడు అని చెప్పాలి. కొత్తగా వచ్చిన వాడే కత్తిలా ఆడి ఏకంగా  తక్కువ బంతుల్లో 87 పరుగులు చేశాడు. వృద్ధిమాన్ సాహా ఊపు చూస్తే తప్పకుండా సెంచరీ పూర్తి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత క్యాచ్ అవుట్ అయిపోయి వెను  తిరిగాడు.  కానీ కొత్తగా జట్టులోకి స్థానం సంపాదించుకున్న వృద్ధిమాన్ సాహా ఇరగ దీయడం వల్లే సన్రైజర్స్ అంతటి ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: