యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కి అంతర్జాతీయ క్రికెట్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెస్టిండీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న క్రిస్ గేల్ ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా గల ఆటగాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి  తెలిసిందే. ఒకసారి క్రిస్ గేల్ మైదానంలో కుదురుకున్నాడు అంటే సిక్సర్ల వర్షం కురుస్తూ ఉంటుంది. క్రిస్ గేల్ చిన్నగా బ్యాట్ ఊపిన  సరే బంతి సిక్సర్  వెళ్తూ ఉంటుంది. అందుకే క్రిస్ గేల్ ఆడుతున్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.



 ఎక్కువ కష్టపడకుండా ఎంతో సునాయాసంగా నిలబడ్డ చోటు నుంచి భారీ సిక్సర్లు కొట్టడం లో  క్రిస్ గేల్ దిట్ట అన్న విషయం తెలిసిందే. అందుకే క్రిస్ గేల్  యూనివర్సల్ బాస్ అని ప్రేక్షకులు అందరూ ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు. ఈ పేరుకు క్రిస్ గేల్ తన ఆటతో న్యాయం చేస్తూ ఉంటాడు. ఐపీఎల్లో క్రిస్ గేల్ మెరిపించే మెరుపులు అన్ని ఇన్ని కావు అన్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు విధ్వంసకర ఇన్నింగ్స్  ఆడుతూ ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటాడు క్రిస్ గేల్. ఈ ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.


 అయితే ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు క్రిస్ గేల్. ఈ  మ్యాచ్ విజయం అనంతరం టీమ్ మేట్  మణిదీప్ సింగ్ క్రిస్ గేల్ ను ఇంటర్వ్యూ చేశాడు. నువ్వు ఇప్పట్లో రిటైర్మెంట్ కావద్దు అని అభిమానులు కోరుకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా మన దీప్ సింగ్ క్రిస్ గేల్ కు చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన క్రిస్ గేల్  క్యాన్సిల్ రిటైర్మెంట్ ఇప్పట్లో అది జరగదు.. అలాంటి ఆలోచనే లేదు అంటూ బదులిచ్చాడు క్రిస్ గేల్. అద్భుతమైన టచ్ లో ఉన్న క్రిస్ గేల్ బ్యాటింగ్ లో ఇబ్బంది పడిన దాఖలాలు లేవు అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు మన్దీప్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: