ఇటీవలే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు సారథిగా ఉన్న రోహిత్  శర్మ  కాయం గాయం  పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిసిసిఐ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా టూర్ కోసం కూడా ఎంపిక చేయలేదు. రోహిత్ ఫిట్నెస్ను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని  అందుకే రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేయలేదు అంటూ బీసీసీఐ తెలిపింది. ఇక ఆస్ట్రేలియా టూర్ లో మూడు ఫార్మాట్లకు సంబంధించిన జట్టును ప్రకటించిన కాసేపటికే నెట్స్ లో  రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ని ముంబై ఇండియన్స్ జట్టు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.



 జట్టులో కీలక ఆటగాడైనా రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై అసలు కారణం ఏంటో చెప్పాలి అంటూ అటు ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి వాస్తవాలు తెలుసుకునే హక్కు అభిమానులకు ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు సునీల్ గవాస్కర్. రోహిత్ శర్మ గాయం గురించి వెల్లడించే విషయంలో బీసీసీఐ  మరింత పారదర్శకత చూపాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.



 ఐపీఎల్ జట్టు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమ జట్టు ఆటగాళ్లు యొక్క గాయం  విషయాలు బయటకు చెప్పకపోవడం లో కాస్త అర్థం ఉంది కానీ... బీసీసీఐ  మాత్రం రోహిత్ గాయం విషయంలో ఏం జరిగిందో చెబితే బాగుండేది అని  అభిప్రాయం వ్యక్తం చేశారు సునీల్  గవాస్కర్. సగటు  అభిమానికి తన ఇష్టమైన అభిమాన క్రికెటర్ గురించి తెలుసుకునే హక్కు ఉంటుంది అంటూ తెలిపాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ నెట్స్ లో  రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేసిన మాట వాస్తవమే అయితే... ఇక అతను గాయం సాకు చెప్పిన బిసిసిఐ తీరు ఏమిటో అర్థం కావడం లేదు అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం రోహిత్ శర్మ ను  సెలెక్ట్ చేయకపోవడంపై మాత్రం తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: