ఇటీవలే ఐపీఎల్ లో ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ తమ ప్రతిభను చాటుకుంటూన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్లు తెర మీదికి వస్తూ  ప్రస్తుతం సూపర్ హీరోలాగా ఎంతో అద్భుతంగా ఐపీఎల్లో రాణిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో రికార్డులు సృష్టించిన దిగ్గజ ఆటగాళ్లు ఐపీఎల్లో విఫలం అవుతుంటే యువ ఆటగాళ్లు మాత్రం వరుసగా మంచి ప్రతిభ కనబరుస్తూ టీమ్ ఇండియా కి ఫ్యూచర్ స్టార్లుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఎంతో మంది టీమిండియాలో చోటు దక్కించుకునేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీని కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూ ఇప్పుడు ఐపీఎల్ వేదికగా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.



 ఇక యువ ఆటగాళ్ల అద్భుత ప్రతిభ తో ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలే ఐపీఎల్ పూర్తికాగానే అటు నుంచి అటే ఆటగాళ్లందరూ ఆస్ట్రేలియా టూర్ కీ  వెళ్లేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. అక్కడ వన్డే టెస్ట్ టి20 ఫార్మాట్లలో మ్యాచ్ లూ  ఆడేందుకు సిద్ధమయ్యింది భారత జట్టు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు  ఎంతగానో ప్రయత్నించినప్పటికీ... కొందరికి  నిరాశ ఎదురైంది. అయితే జట్టు సెలక్షన్ పై ప్రస్తుతం పలు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.



 ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఐపీఎల్ లో కూడా నిలకడగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో ఎంపిక చేయకపోవడంపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చెలరేగి పోయినా సూర్యకుమార్ యాదవ్ తనను  సెలెక్ట్ చేయండి కలెక్టర్లు అందరికీ సరైన సమాధానం ఇచ్చాడు అంటూ ప్రస్తుతం ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 43 బంతుల్లోనే డెబ్బై ఆరు పరుగులు చేశారు సూర్యకుమార్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: