ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో పేలవ ప్రదర్శన చేసి చివరికి ఐపీఎల్ సీజన్ నుంచి ప్లే యాప్ అర్హత సాధించకుండానే లీగ్ దశలోనే నిష్క్రమించిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అపఖ్యాతి మూటగట్టుకున్న విషయం తెలుస్తుంది. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఆడిన ప్రతి సారి కూడా ప్లేఆఫ్ కి అర్హత సాధించిన ఏకైక జట్టుగా ఇన్ని రోజుల వరకు కొనసాగింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంతే కాకుండా ఎక్కువ సార్లు ఫైనల్కు చేరిన జట్టుగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది.



 అంతేకాకుండా మూడు సార్లు టైటిల్ కూడా గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అలాంటిది దిగ్గజ  జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి కనీసం  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఎంతోమంది తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. డాడీస్ ఆర్మీ పని అయిపోయిందని... ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సరిగ్గా రాణించలేదు అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై వస్తున్న విమర్శలపై అటు కొంతమంది మాజీలు తప్పు పడుతూ ఉంటే మరికొంతమంది మాత్రం సమర్ధిస్తున్నారు.



 ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానం లోకి చెన్నై పడిపోవడం.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఎన్నో ట్రోల్స్  కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇక తాజాగా వీటిపై భారత మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక సీజన్లో విఫలం అయినంత మాత్రాన ధోని ప్రతిభను తప్పుపట్టడం సరైనది కాదని. మొత్తం జట్టు  చేసిన పనికి ధోనీ ఒక్కడినే కారణం చూపుతూ విమర్శించడం సరైనది కాదు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: