ఐపీఎల్ కోసం క్రికెట్ ప్రేక్షకులందరూ ఏ రేంజ్ లో ఎదురు చూస్తారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు సాధారణంగానే టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షించే ప్రేక్షకులు.. ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడుతూ రావడంతో అభిమానులందరికీ నిరాశే ఎదురైంది అన్న విషయం తెలిసిందే.  అంతే కాకుండా దాదాపుగా ఆరు నెలలకు పైగా నే క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్ కు దూరమైన ప్రేక్షకులందరూ ఐపీఎల్ ద్వారా ఎంటర్టైన్మెంట్ పొందాలి అని ఎంతో ఆశగా ఎదురు చూసారు.



 ఇక చివరికి వాయిదా పడుతూ వచ్చిన ఐపీఎల్ యూఏఈ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే.  దీంతో క్రికెట్ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఐపీఎల్ కి రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే.  గత 13 ఏళ్ల నుంచి కూడా ఎంతో క్రేజ్ సొంతం చేసుకుంటుంది ఐపీఎల్. కేవలం భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐపీఎల్ టోర్నీకీ  ఎంతో గుర్తింపు ఉంది. అంతేకాదు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ టోర్నీలో ఆడే ఎందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.



 అయితే ఐపీఎల్ టోర్నీ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభ చాటుకుని భారత జట్టులో స్థానం సంపాదించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎన్నో సూపర్ ఓవర్ లూ  జరిగాయి ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగింది ఎంతో మంది కుర్రాళ్లు తమ ప్రతిభను చాటుకున్నారు అంటూ చెప్పిన సౌరవ్ గంగూలీ... మొదటివారం  మ్యాచ్ లను  26.9 కోట్ల మంది వీక్షించారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: