భారత దిగ్గజ క్రికెటర్ మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్ కి పూర్తిగా దూరమైపోయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే మళ్లీ భారత జట్టులోకి అదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు అని అభిమానులు ఎదురు చూడ్డమే తప్ప మళ్ళి ఎంట్రీ  ఇవ్వలేదు. మైదానంలోకి అడుగు పెట్టలేదు. ఇక ఈ క్రమంలోనే ఊహించని విధంగా రిటైర్మెంట్ ప్రకటించాడు  మహేంద్రసింగ్ ధోని. ఇక ఆ తర్వాత ఐపీఎల్లో అయినా ధోనీ ఆటను చూసి మురిసిపోవాలి అని అనుకున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే వాయిదా పడుతూ వచ్చిన ఐపీఎల్ కాస్త ప్రస్తుతం యూఏఈ  వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధోనీ ఆట చూడాలని ప్రతి మ్యాచ్లో అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.



 ఐపీఎల్ ప్రారంభమై రోజులు గడిచిపోతున్నాయి కానీ ధోని ఆట చూడాలి అన్న అభిమానుల కోరిక మాత్రం తీరలేదు. టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఎంతో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొంది. ఐపీఎల్  సీజన్లో లీగ్ దశ నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా  చెన్నై సూపర్ కింగ్స్ మారిపోయింది. ఇక కనీసం  ఇప్పుడైనా చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగి ఆడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ  గత రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఆ తర్వాత పుంజుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.



 అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం అయితే సాధించింది కానీ ధోని ఆట చూడాలి అనుకున్న అభిమానుల కోరిక మాత్రం తీరలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడే ప్రతి ముందు ఎలాగైనా ధోనీ అద్భుతమైన ప్రదర్శన చూడాలని అనుకుని ప్రేక్షకులు టీవీల ముందు కూర్చుంటారు. కానీ ధోని తక్కువ  పరుగులు చేసి.. అది కూడా ఎలాంటి సిక్సర్లు ఫోర్లు కొట్టకుండా చివరికి ఎంతో ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేసి చివరికి అవుట్ అవుతూ ఉండటంతో  అభిమానులకు నిరాశ తప్పలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధిస్తున్నపటికి ధోని ఆట చూడలేక పోతున్నాము అని అటు అభిమానులు నిరాశ లో రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: