ప్రస్తుతం ఐపీఎల్ ప్రేక్షకులందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు వరకూ ఐపీఎల్ కామెంట్రీ మొత్తం కేవలం ఇంగ్లీష్ హిందీ లో మాత్రమే ఉండేది. కాని గత రెండు మూడు సీజన్ల  నుంచి తెలుగులో కూడా కామెంటరీ అందిస్తుండటంతో తెలుగు ప్రేక్షకులందరూ తెలుగు కామెంట్రీ వింటూ మ్యాచ్ వీక్షిస్తూ ఉండడంతో తెలుగు ప్రేక్షకులందరికీ మరింత మజా అందుతుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం తెలుగు కామెంట్రీ తో మైమర్చిపోతున్న తెలుగు ప్రేక్షకులందరికీ ఇటీవల నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అయితే అంపైర్లు ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే.



 కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం ఇక అంపైరింగ్ చేస్తున్న వ్యక్తి  తెలుగు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నిన్న కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చివరి బాల్ వరకు ఏ జట్టు గెలుస్తుంది అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంది, అయితే ఇక చివరి 12 బంతుల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 30 పరుగులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



  ఈ క్రమంలోనే ఎవరు గెలుస్తారో  అని అనుకుంటున్న తరుణంలో రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్ జరిగేటప్పుడు 19వ ఓవర్లో సామ్ కరణ్  పోలింగ్ చేస్తున్న సమయంలో ఓ బంతిని ఆఫ్ సైడ్ వేసాడు. దీంతో అప్పుడు బ్యాటింగ్ చేస్తున్న దినేష్ కార్తీక్ ఇది వైడ్  కాదా అని అడిగాడు. దీంతో వెంటనే బదులు ఇచ్చిన అంపైర్ బంతి చాలా లోపల ఉంది... కొంచెం కూడా కాదు చాలా లోపల అంటూ నవ్వాడు. అయితే హైదరాబాద్ కు  చెందిన షంషుద్దీన్  ఇటీవల ఐపిఎల్ మ్యాచ్ లో తెలుగు వ్యాఖ్యలు చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: