ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు విజయం కోసం తహతహలాడిపోయే అన్ని జట్లు ప్రస్తుతం ప్లే ఆఫ్ లో  అర్హత సాధించేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్లే ఆప్ కి అర్హత సాధించడంలో  మొదటి మూడు స్థానాలో ముంబై బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ కు అర్హత ఉండగా  ఇక నాలుగవ స్థానం గురించి ప్రస్తుతం మిగతా అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఈ నాలుగవ స్థానాన్ని సంపాదించుకునేందుకు  ప్లేఆఫ్ రేసులో ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ కూడా టాప్4లో చోటు దక్కించుకోవడం కోసం ఎదురు చూస్తుంది. అయితే ప్రస్తుతం ప్లే ఆఫ్  లు అర్హత సాధించేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకీ  అవకాశం ఉన్నప్పటికీ ఎన్నో అద్భుతాలు జరగాల్సి ఉంది.




 చివరి రెండు మ్యాచ్ లలో  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి రన్  రేటు తో విజయం సాధించాలి... అంతేకాకుండా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మ్యాచ్ ఓడిపోవాల్సి  ఉంటుంది. లేదా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తర్వాత రెండు మ్యాచ్ లలో  ఓటమిపాలైన సన్రైజర్స్ జట్టుకి ప్లే ఆఫ్  చేరే అవకాశం సజీవంగానే ఉంటుంది. అయితే ఇక మిగతా జట్ల  ఓటమి అన్నది పక్కన బెడితే సన్రైజర్స్ మాత్రం రాబోయే రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా మంచి విజయం సాధించడం ఎంతో ముఖ్యం.



 ఇక్కడ మరో కిటుకు ఏమిటంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడబోయే రెండు మ్యాచ్ లు  కూడా ప్రస్తుతం వరుస విజయాలతో పాయింట్ల పట్టిక లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లతో ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే షార్జాలో ముంబై తో మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కాగా  ఇప్పుడు పాయింట్ల పట్టిక లో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ రెండు జట్లను సన్రైజర్స్ ఓడించగలగడం సన్ రైజర్స్ ముందు ఉన్న పెద్ద టాస్క్ . చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: