క్రిస్‌ గేల్.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటంలో క్రిస్ గేల్‌ కు మంచి పేరుంది. కానీ ఈ ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేదన్న అసంతృప్తిని చెరిపేస్తూ.. శుక్రవారం కుమ్మేశాడు.. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ అయ్యాడు. 99 పరుగులతో రాణించాడు. అయితే అతడు అంతగా ఆడినా.. కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌కు ఓటమి తప్ప లేదు.. చివరకు పంజాబ్‌ పై రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం అందుకుంది. గేల్ విజృంభణతో పంజాబ్‌ 185 పరుగులు చేసినా..  రాజస్థాన్‌  కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రాజస్థాన్‌ బ్యాటింగ్‌ లో స్టోక్స్‌ 50, శాంసన్‌ 48, స్మిత్‌ 31 పరుగులు చేసి జట్టును గెలిపించారు.

పంజాబ్‌ బౌలర్లు మురుగన్‌ అశ్విన్‌, జోర్డన్‌లకు చెరో వికెట్‌ లభించింది. పంజాబ్‌ బ్యాటింగ్‌లో అత్యధికం  గేల్‌ 99 చేయగా.. రాహుల్‌ 46  పూరన్‌ 22 పరుగులు చేశారు. రాజస్థాన్‌ బౌలింగ్‌ లో  స్టోక్స్‌, ఆర్చర్‌లకు చెరో 2 వికెట్లు పడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  గేల్ వీరవిహారంతో భారీ స్కోరు సాధించింది. క్రిస్‌గేల్‌ 63 బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు 99 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో  పంజాబ్‌ 20 ఓవర్లలో 4  వికెట్లకు 185 పరుగులు చేసింది.


గేల్‌ కు తోడుగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా రాణించాడు 41 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. చివర్లో నికోలస్‌ పూరన్‌  10 బంతుల్లో 3సిక్సర్లతో 22 చేశాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ ఔటయ్యాడు. అయితే ఫామ్‌లో ఉన్న రాహుల్‌, గేల్‌ కుమ్ముడు ప్రారంభించారు. నాలుగో ఓవర్లో గేల్‌ కు  ఓ లైఫ్ వచ్చింది. 12 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను రియాన్‌ పరాగ్‌ వదిలేశాడు. ఆ తర్వాత గేర్‌ మార్చిన గేల్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

రెచ్చిపోయిన గేల్ కార్తీక్‌ త్యాగీ వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్‌ బాది 14 రన్స్‌ రాబట్టాడు. వరున్‌ అరోన్‌ వేసిన తర్వాతి ఓవర్లో రాహుల్‌ ఫోర్‌, సిక్సర్‌ కొట్టి 14 పరుగులు సాధించాడు.  క్రీజులో కుదురుకున్నాక  గేల్‌ మరింత రెచ్చిపోయాడు. ఆర్చర్‌ వేసిన 20వ ఓవర్‌ మూడో బంతిని సిక్సర్‌ బాదిన గేల్‌ తర్వాతి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. మొత్తానికి పంజాబ్‌ ఓడినా క్రిస్ గేల్ విజృంభణ మరిచిపోలేనిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: