ఐపీఎల్ లో ప్రతి పోరు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఎంతో హోరా హోరీ గా మారిపోయింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బాల్ వరకు ఎవరు గెలుస్తారు అన్నది ఎంత ఉత్కంఠ నెలకొంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్  కె.ఎల్.రాహుల్ అవుట్ కావడంతో పంజాబ్  పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఏ రేంజిలో విజృంభించి ఆడాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 41 ఏళ్ళ  వయసులో కూడా భారీ  సిక్సర్లు బాది తో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు క్రిస్ గేల్. కేవలం సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వికెట్ కోల్పోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు  క్రిస్ గేల్. ఏకంగా 69 బంతుల్లో 99 పరుగులు చేశాడు క్రిస్ గేల్. ఇక ఆ తర్వాత ఎనభై ఐదు పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా రాణించడంతో వేగంగా 17.3 లోనే లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అయితే 99 పరుగులు చేసిన సమయంలో  ఆర్చర్ యార్కర్ వేయడంతో ఒక్క పరుగు ముందు అవుట్ అయ్యాడు క్రిస్ గేల్.



 దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన క్రిస్ గేల్ బ్యాట్  విసిరికొట్టాడు. ఇక కాసేపట్లోనే మళ్ళీ కూల్ అయి తనను  బౌల్డ్  చేసిన టార్చర్ తో చేయి కలిపాడు... మరి ఎండ్ లో  ఉన్న మ్యాక్స్వెల్ గేల్ కి  బ్యాట్ అందించాడు. ఇక 99 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత బ్యాట్ విసిరికొట్టి నేపథ్యంలో ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది.  దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్  కాంటాక్ట్ లో 2.2 లోని లెవెల్ ప్రకారం మ్యాచ్ రిఫరీ క్రిస్ గేల్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించినట్లు ఐపీఎల్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: