ఇటీవలి ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఎంతో అద్భుతంగా రాణించి ఎంతో మంది ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంతో అద్భుతంగా ప్రస్థానాన్ని కొనసాగించి ఐదవసారి టైటిల్ గెలిచి ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. మొదట ఓటమితో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు ఆ తర్వాత మాత్రం వరుస విజయాలను సొంతం చేసుకుంటూ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుని.. చివరికి టైటిల్ గెలిచింది కూడా. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా ఎంతో అద్భుతంగా రాణించారు.


 ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా.. ప్రస్తుతం రోహిత్ సేనా అద్భుత రికార్డు సృష్టించి ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బాధ్యతగల ఇన్నింగ్స్ ఆడి ప్రశంసలు అందుకున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి సూర్యకుమార్ యాదవ్ కు భారత జట్టులో స్థానం దక్కుతుంది అని అందరూ అనుకున్నారు కానీ బీసీసీఐ  సూర్యకుమార్ యాదవ్ ను  సెలక్ట్ చేయకుండా షాకిచ్చింది.



 ఈ క్రమంలోనే భారత జట్టుకు ఎంపిక కాకపోవడం పై తీవ్ర అసంతృప్తి చెందాను  అంటూ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ఎంపిక కాని ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కు సరైన సమయం వస్తుంది అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. బిసిసీఐ  సెలెక్ట్  చేయకపోవడంపై సూర్యకుమార్ యాదవ్ తీవ్ర నిరాశలో మునిగిపోయాడని ఆ రోజు అతని తో తాను  కూడా మాట్లాడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ తన దగ్గరికి వచ్చి నువ్వేం బాధపడకు బాధ నుంచి కోలుకుని ముంబై ఇండియన్స్ విజయం కోసం ఆడతాను అంటూ చెప్పడంతో అతనిలోని పరిణితి తనకు ఎంతగానో నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: