ఐపీఎల్ టోర్నీ ముగియగానే భారత జట్టు అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో ఊహించని మార్పులు చేసింది టీమిండియా జట్టు. ముఖ్యంగా భారత వైస్ కెప్టెన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను  సెలెక్ట్ చేయకుండా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆతర్వాత మెత్తబడిన బీసీసీఐ వన్డే టి20 లకు కాకుండా చివరిగా టెస్ట్ సిరీస్ లకు రోహిత్ శర్మను ఎంపిక చేసింది. అది కూడా వైస్ కెప్టెన్ గా కూడా నియమించలేదు. అయితే వన్డే టి20 లకు విరాట్ కోహ్లీ సారథ్యంలోనే జరగనున్నాయి. కానీ టెస్ట్ సిరీస్ మాత్రం మొదటి సారి విరాట్ కోహ్లీ లేకుండా జరగబోతుంది దీనికి అజింక్యా రహనే సారథ్యం వహించనున్నారు.



 ఇదిలా ఉంటే టెస్ట్ సిరీస్లో ఓపెనింగ్ జోడి ఎవరు బరిలోకి దిగ పోతున్నాను అన్నదానిపై  ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మల ఓపెనర్ గా  బరిలోకి దింపుతున్నాడా  లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీలు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల స్పందించిన రోహిత్ శర్మ తాను ఏ స్థానంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచాడు అన్న  విషయం తెలిసిందే. బీసీసీఐ  ఏ స్థానంలో తాను బరిలోకి దింపిన ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.



 అయితే ఇటీవలే ఎంతోమంది మాజీ క్రికెటర్లు సైతం ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా టెస్ట్ క్రికెట్ లో ఎవరు ఓపెనింగ్ జోడిగా దిగితే బాగుంటుంది అనే దానిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్లో చివరి మూడు మ్యాచ్లకు కూడా విరాట్ కోహ్లీ హాజరు కాబోతున్న నేపథ్యంలో జట్టు కూర్పు పై ప్రస్తుతం ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే హర్భజన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.  మయాంక్ అగర్వాల్ రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడి గా బరిలోకి దిగాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్. ఇక ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ కె.ఎల్.రాహుల్ ఏ స్థానంలో అయినా రాణించగల సత్తా ఉందని కోహ్లీ  స్థానంలో బరిలోకి దిగితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఇక భారత బ్యాట్స్మెన్లు బూమ్రా, ఇషాంత్ షమీ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లను  ఇబ్బంది పెట్టగల సత్తా ఉన్నవారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు హర్భజన్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: