ఇటీవలే ఐపీఎల్ టోర్నీలో భాగంగా గాయాల బారిన పడిన టీమిండియా స్టార్ ఓపెనర్.. రోహిత్ శర్మ కీలక బౌలర్ ఇషాంత్ శర్మ గాయాల బారిన పడడంతో ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ బెంగళూరులో శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఇద్దరు ఆటగాళ్ళు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు టెస్టు టీమ్  లో సభ్యులుగా ఉన్నారు. మొదట  భారత జట్టు టెస్టు సిరీస్ ని మొదలు పెట్టనుంది అన్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ ప్రారంభం అయ్యేనాటికి ఇద్దరు ఆటగాళ్ళు పూర్తి ఫిట్నెస్ సాధించిన ఆస్ట్రేలియా కు చేరుకుని జట్టులో భాగం అయ్యే అవకాశం ఉంది.



 కాగా ఈ ఇద్దరూ పూర్తి ఫిట్నెస్ సాధించిన ఆస్ట్రేలియా చేరుకొని జట్టులో  లో చేరడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీమ్ ఇండియా కోచ్ రవి శాస్త్రి. బెంగళూరులో శిక్షణ పొందుతున్న ఇద్దరు ఆటగాళ్ళు ఆ తర్వాత ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్తారు అన్న విషయాన్ని ఇప్పటివరకు బిసిసిఐ ప్రకటించలేదు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఆటగాళ్లు ఆస్ట్రేలియా వెళ్లినప్పటికీ అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇద్దరు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఆటగాళ్లు సోమవారమే బయలుదేర వలసి ఉంటుంది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గాయం కారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్కు రోహిత్ శర్మ కొన్ని రోజుల పాటు దూరమయ్యాడు. అతనికి ఎంత మేరకు విశ్రాంతి అవసరం అనేది ప్రస్తుతం మెడికల్ చూసుకుంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. రోహిత్  శర్మ  టెస్ట్  సిరీస్  ఆడాలంటే మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియా బయలుదేర వలసి ఉంటుంది.. లేకపోతే వారిద్దరూ టెస్ట్ సిరీస్ ఆడటం  కష్టతరంగా మారుతోంది.. ఒకవేళ రోహిత్ ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవలసి వస్తే క్వారంటైన్ ఈ కారణంగా మైదానం లో అతనికి ఇబ్బందులు ఎదురవుతాయి.. అంటూ  రావిశాస్త్రి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: