ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది అనే విషయం తెలిసిందే.  అక్కడ పరిమిత ఓవర్ల క్రికెట్ తో పాటు టెస్ట్ క్రికెట్ కూడా ఆడనుంది. అయితే ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో దాదాపు మూడు టెస్టు మ్యాచులకు విరాట్ కోహ్లీ దూరం అయ్యే అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ప్రస్తుతం మొదటి బిడ్డకు జన్మనివ్వనుండగా ఆ సమయంలో తన భార్యకు తోడుగా ఉండాలని భావించిన విరాట్ కోహ్లీ బీసీసీఐ దగ్గర పితృత్వ సెలవులకు దరఖాస్తు చేసుకోవడంతో ప్రస్తుతం బీసీసీఐ  సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఎంతో మంది మాజీ లు సైతం కోహ్లీ  నిర్ణయంపై ప్రస్తుతం ఎంతో గౌరవం వ్యక్తం చేస్తున్నారు.



 భారత్ ఆస్ట్రేలియా మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగకముందే ప్రస్తుతం విరాట్ కోహ్లీ సెలవు గురించి చర్చ మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ నిర్ణయంపై కొంత మంది నెటిజన్లు విమర్శలు చేస్తూ ఉంటే ఎంతో మంది క్రికెటర్లు సైతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి  మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఇటీవల టీం ఇండియా కోచ్  రవి శాస్త్రి విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని సమర్ధించాడు. కోహ్లీ సరైన నిర్ణయం తీసుకున్నాడు అని భావిస్తున్నాను ఇలాంటి మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ రావు.. అతనికి అవకాశం ఉంది కాబట్టి స్వదేశానికి వెళ్తున్నాడు.. అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.



 అయితే గత కొంత కాలం నుంచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్న కోహ్లీ గైర్హాజరు తో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి. అయితే విరాట్ కోహ్లీ లేకపోవడం జుట్టు కాస్త కష్టమే అయినప్పటికీ.. జట్టులో అందరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ లేకుండా రాణించేందుకు సిద్ధమవుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తండ్రి చనిపోయిన మరుసటిరోజు విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడాడని  కానీ ప్రస్తుతం బిడ్డ కోసం ప్రత్యేకంగా భారత్ తిరిగి వస్తున్నాడు అని ఎంతోమంది విమర్శలు చేస్తున్నారూ  అంటూ గుర్తు చేసిన భారత దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ దీనిపై తప్పుపట్టాల్సిన అవసరం లేదని.. కోహ్లీ బాధ్యతలు జట్టు భరించాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: