సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లలో కొన్ని కొన్ని సార్లు స్లెడ్జింగ్  జరుగుతూంటుంది అనే విషయం తెలిసిందే. ప్రత్యర్థి ఆటగాళ్ల దృష్టిని మరల్చేందుకు మాటలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రత్యర్థి ఆటగాళ్లు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మైదానంలో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే గతంలో ఆస్ట్రేలియా భారత్ మధ్య ఇలా ఎన్నో సార్లు మాటల యుద్ధం నడిచింది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దాదాపు 9 నెలల తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ మూడు వన్డేలు మూడు టి20 లు 4 టెస్టు సిరీస్ లు  ఆడనుంది  భారత జట్టు. దీని కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.



 కాగా ఆస్ట్రేలియా కరోనా  వైరస్ తర్వాత మొదట భారత్ తో తలపడనున్న నేపథ్యంలో ఇటీవల ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్తో జరగబోతున్న సిరీస్లో తాను ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోను  అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్. కోహ్లీసేన కొన్ని కొన్ని సార్లు స్లెడ్జింగ్ పాల్పడి మాటలతో దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని... చెప్పుకొచ్చాడు. అయితే గతంలో వార్నర్ ఎంతో దూకుడుగా వ్యవహరించే వాడు అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి ఆటగాళ్లను మాటలతో కవ్వించడంతోపాటు గొడవకు దిగడం లో కూడా ముందుండేవాడు డేవిడ్ వార్నర్.



 కానీ ప్రస్తుతం క్రికెట్లో పరిణతి సాధించి దిగ్గజ ఆటగాడి గా ఎదిగిన తర్వాత మాత్రం మైదానంలో ఎంతో కూల్ గా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ  ప్రస్తుతం భారత్తో జరగబోయే సిరీస్లో భారత ఆటగాళ్ల తను కవ్వించినప్పటికీ కూడా తాను మాత్రం ఎలాంటి అసహనానికి గురి కాను  అంటూ చెప్పుకొచ్చాడు. ఇకనుంచి తాను కాదు తన బ్యాట్ మాట్లాడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. గత కొంతకాలం నుంచి తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నా అంటూ చెప్పుకొచ్చినా  డేవిడ్ వార్నర్.. తాను ఒక వేళ సహనం కోల్పోతే ఆ ప్రభావం సహచరులపై కూడా పడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: