ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అనే విషయం తెలిసింది. భారీ అంచనాల మధ్య ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఆ తర్వాత కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ తప్పుకొని ఇయాన్ మోర్గాన్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ రావడం అదే సమయంలో అటు దినేష్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం... వెంటనే ఇయాన్ మోర్గాన్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం జరిగిపోయింది అయినా  జట్టు ఆటతీరును మాత్రం ఎక్కడా మార్పు రాలేదు.


 దీంతో కోల్కతా జట్టు పేట్ మార్చే  ఆటగాడు ఎవరు అని అటు ఫ్రాంచైజీ  కూడా ఆశగా ఎదురుచూస్తుంది తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్  చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ సీజన్ లో శుభ్ మన్ గిల్ ని   కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్గా చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. చాలామంది క్రికెటర్లను కోల్కతా జట్టు రిటైర్డ్ చేసుకోలేదు అంటూ వ్యాఖ్యానించినా ఆకాశ్ చోప్రా.. కొందరిని రిలీజ్ చేయడం ఎంతో బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు. శుభ్ మన్ గిల్,  వరుణ్ చక్రవర్తి ఆండ్రూ రస్సెల్ ను  మాత్రమే రిటైన్  చేసుకోవడం బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు ఆకాష్  చోప్రా.  



 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యువ ఆటగాడు అయినా శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి మెరుగైన ఫలితాలను రాబట్టినట్లు గానే  కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు శుభ్ మన్ గిల్ కి  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నించాలని సూచించారు.  అతనిలో  నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని... అందుకే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఒకవేళ అతని వేరే జట్టు  తీసుకున్నారంటే అవకాశం మళ్ళీ రాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు శుభ్ మన్ గిల్ కి  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే... రోహిత్ రేంజ్ లో విజయాలను అందిస్తాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: