రోహిత్ శర్మ అంశం మరోసారి భారత క్రికెట్ లో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ సీజన్ లో ఒక మ్యాచ్లో తొడ కండరాలు పట్టేయడం తో గాయం బారిన పడిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఫిట్నెస్ సాధించినా  భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన కోసం రోహిత్ శర్మను  ఎంపిక చేయలేదు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత బిసిసిఐ పై విమర్శలు రావడంతో మళ్లీ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కోసం బిసిసిఐ ఎంపిక చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అయితే రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదని అందుకే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం లేదు అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది.



 దీంతో ప్రస్తుతం క్రికెట్ ఫాన్స్ అందరు బిసిసిఐ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గాయపడిన రోహిత్ శర్మను దుబాయ్ నుంచి ఇండియాకు పంపించిన బీసీసీఐ  .. గాయం బారినపడిన సాహా  ను మాత్రం ఎందుకు ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకెళ్ళింది అంటూ ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ విషయంలో బిసిసిఐ రాజకీయాలు చేస్తోంది అంటూ ప్రస్తుతం ఎంతో మంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎంతో ఫిట్ గా ఉన్నాను అని రోహిత్ శర్మ చెబుతున్నప్పటికీ కూడా.. బోర్డు  వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు ఎంతో మంది నెటిజన్లు.



 రోహిత్ శర్మ గాయం విషయంలో సరైన వివరాలు తెలుపుతూ ప్రకటన ఎందుకు చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు రోహిత్ శర్మతో బిసిసిఐకి సమస్య ఏంటో చెప్పాలి అంటూ మరికొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే గాయం బారిన పడిన రోహిత్ శర్మ బీసీసీఐ  సూచించినప్పటికీ ముంబై ఇండియన్స్ కి ప్రాధాన్యం ఇచ్చి మైదానంలో దిగి ఆడటం వల్ల నే..బోర్డు  ఇలా వ్యవహరిస్తుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది అయితే ఐపీఎల్లో గాయపడిన సాహా బిసిసిఐ సూచన మేరకు తర్వాత  మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు కానీ రోహిత్ శర్మ మాత్రం మ్యాచ్లు ఆడటంతో బీసీసీఐ  ప్రస్తుతం ఇలా రోహిత్ శర్మ ఈ విషయంలో వ్యవహరిస్తుంది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: