ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ ప్రారంభం ఆస్ట్రేలియా చేరుకొని క్వారంటైన్ పూర్తి చేసుకొని టెస్ట్ జట్టు  లో చేరుతాడు అని అనుకుంటే.. అయితే రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేని   కారణంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది. కాగా గాయం బారిన పడిన రోహిత్ శర్మ ఇషాంత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో తొలి రెండు టెస్ట్ లకు  దూరమయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇద్దరు ఆటగాళ్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నారు




 అయితే డిసెంబర్ 8న రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బయలుదేరినప్పటి మరో రెండు వారాలు అక్కడ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. డిసెంబర్ 22 వరకు చేయడం చివరి టెస్ట్ ప్రారంభం కానున్న మూడో టెస్టుకు మాత్రమే అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది... రోహిత్ శర్మ పూర్తిగా టెస్టు సిరీస్ నుంచి వైదొలిగే శ్రేయస్ అయ్యర్ జట్టులోకి  చేరే అవకాశం ఉంది. ఇక ఇషాంత్ శర్మ తొలి టెస్టు ఆడటానికి వెంటనే ఆస్ట్రేలియా బయలుదేరాల్సి ఉంటుంది. కానీ అతడు ఫిట్నెస్ సమస్యలతో బాధ పడుతున్న నేపథ్యంలో... ప్రస్తుతం టెస్ట్ సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉంది.



 ఒకవేళ తొలి రెండు టెస్ట్ లకు  ఇషాంత్ శర్మ దూరమైతే హైదరాబాద్ బౌలర్ సిరాజ్ కి   తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ఖాయంగా కనిపిస్తోంది. దాదాపుగా ఇషాంత్  శర్మ తొలి రెండు టెస్ట్ లకు  అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో సిరాజ్ తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. ఒకవేళ సిరాజ్ నిరూపించుకుంటే  మాత్రం ఆ తర్వాత జట్టు  యాజమాన్యం అతన్నే  తర్వాత టెస్టులలో కూడా కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: