ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు గురించి ఎన్నడూ లేనివిధంగా ఆసక్తికర చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఓవైపు జట్టు ఓపెనర్లుగా  ఎవరిని జట్టు యాజమాన్యం రంగంలోకి దింపుతుంది అన్న దానిపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది.  ఒక అదే సమయంలో ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా.. రిషబ్ పంత్ లాంటి ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్న నేపథ్యంలో ఎవరిని రంగంలోకి దింపు తారూ  అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉండి ప్రస్తుతం ప్రాక్టీస్ మొదలు పెట్టి ఆస్ట్రేలియా జట్టుతో తలపడేందుకు   సిద్ధమవుతున్న భారత జట్టు  పై గత కొన్ని రోజులుగా ఏదో ఒక వార్త హల్చల్ చేస్తోంది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో వికెట్కీపర్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు అన్న దానిపై భారత క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం  ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసిన.. రిషబ్ పంత్ వృద్ధిమాన్ సాహా లు అత్యుత్తమ వికెట్ కీపర్ లు అంటూ వ్యాఖ్యానించిన సౌరవ్ గంగూలీ... తుది జట్టులో ఇద్దరిలో ఒకరికి మాత్రమే స్థానం దక్కుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే రిషబ్ పంత్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అతనికి  అపారమైన ప్రతిభ ఉంది అంటూ చెప్పుకొచ్చారు సౌరవ్ గంగూలీ. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఫామ్ లో  ఉన్న ఒక్కరికి మాత్రమే తుది జట్టులో అవకాశం దక్కుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.



 ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా తో మూడు వన్డేలు మూడు టి20 లు నాలుగు టెస్ట్ సిరీస్ లు  ఆడేందుకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ గాయం బారినపడి ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా చేరుకొని తుది జట్టులో చేరుతాడా  లేదా అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అదే సమయంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ తన భార్య ప్రసవం ఉన్న నేపథ్యంలో ఇండియాకి తిరిగి వచ్చే అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: