ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటలో న ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత జట్టు అక్కడ ఆస్ట్రేలియా జట్టుతో తలపడేందుకు  తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. మరి కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా భారత్ మధ్య మ్యాచ్  జరిగేందుకు అంతా సిద్ధం చేస్తోంది బిసిసిఐ. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టులోని ఏ  ఆటగాళ్లు ఏ స్థానంలో ఆడబోతున్నారూ  అనేదానిపై ఆసక్తికర చర్చ గత కొన్ని రోజుల నుంచి వైరల్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓపెనర్లుగా బీసీసీఐ  ఎవరిని రంగంలోకి దింపి బోతుంది అన్నదానిపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ వన్డే టి20 లకు వైస్ కెప్టెన్ గా మారిన నేపథ్యంలో కె.ఎల్.రాహుల్ ని ఏ స్థానంలో బ్యాటింగ్కు దింపుతారు అని ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.



 మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ సీజన్ లో కె.ఎల్.రాహుల్ ఎంతో అద్భుతంగా రాణించారు అన్న విషయం తెలిసిందే. ఎంత ఒత్తిడిలో అయినా అద్భుతంగా రాణిస్తూ జట్టును విజయతీరాలకు నడిపించేందుకు ఎంతగానో కృషి చేశాడు. కానీ మిగతా ఆటగాళ్లు నుంచి తోడ్పాటు అందకపోవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అంతగా రాణించలేక పోయింది అనే విషయం తెలిసిందే. అయితే ఓ వైపు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ఒత్తిడిలో కూడా అద్భుతంగా రాణించాడు కేఎల్ రాహుల్. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా కె.ఎల్.రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్తో అలరించాడు.


 కేఎల్ రాహుల్ ను ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ లలో  ఏ స్థానంలో బ్యాటింగ్కు దింపుతారు అన్న చర్చ మొదలవ్వగా.. ఇటీవల దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో ఫార్మాట్ ను బట్టి తన స్థానంలో మార్పు ఉండే అవకాశం ఉంది అంటు  అభిప్రాయం వ్యక్తం చేశాడు కేఎల్ రాహుల్. అయితే తాను ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగాలి అన్నది  జట్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఏ స్థానంలో ఆడినా  బాగా రాణించడానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.. ఐపీఎల్లో రాణించినట్లు గానే కూడా అదే పునరావృతం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జట్టును చూసుకోవడానికి కోహ్లీ ఉన్నాడు కాబట్టి  స్వేచ్ఛగా ఆడడానికి అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: