ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. దీని కోసం తీవ్రస్థాయిలో ప్రాక్టీసు మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే. నవంబర్ 27న సిడ్నీ వేదికగా జరగబోయే తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో  జట్టు తలపడనుంది భారత జట్టు. అయితే కరోనా  విజృంభించిన తర్వాత పూర్తిగా క్రికెట్కు దూరమైన భారత జట్టు ఇటీవల ఐపీఎల్ పూర్తి చేసి మొదటి సారి తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనుంది. వన్డే సిరీస్తో ఆస్ట్రేలియా పర్యటనను ప్రారంభించనుంది.



 కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఎలా రాణిస్తోంది అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అయితే గతంలోనే గణాంకాలు చూసుకుంటే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది ఇక ఈ సారి కూడా తప్పనిసరిగా సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది భారత జట్టు. కాగా ప్రస్తుతం వన్డే జట్టులో రోహిత్ శర్మకు బీసీసీఐ  సెలెక్టర్లు సెలెక్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో జట్టులో విరాట్ కోహ్లీపై ఎక్కువగా భారం పడే అవకాశం ఉంది. అంతేకాదు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కెప్టెన్గా విరాట్ కోహ్లీ మంచి రికార్డు కూడా ఉంది.



 ఇప్పటికే ఆస్ట్రేలియా విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆస్ట్రేలియాతో 17 మ్యాచ్లు ఆడితే ఏకంగా పదకొండు మ్యాచ్ లలో  విజయం సాధించింది  భారత జట్టు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొన్ని అరుదైన రికార్డులు విరాట్ కోహ్లీ ఊరి స్తున్నాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలో మరో మూడు విజయాలు సాధిస్తే.. విరాట్  ధోని  సరస నిలుస్తాడు.  వన్డే సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ వన్డే సిరీస్ లో రెండు శతకాలు చేస్తే సచిన్ రికార్డును కూడా బ్రేక్  చేస్తాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఆస్ట్రేలియా 9 శతకాలు బాదిన బ్యాట్స్ మెన్ గా సచిన్ ఉండగా 8 శతకాలతో  ప్రస్తుతం కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: