ప్రస్తుతం భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత జట్టు ఓపెనర్ గా ఎవరు బరిలోకి దిగబోతున్నారు  అన్న దానిపై చర్చ కొనసాగుతున్నట్లు  గానే  అటు ఆస్ట్రేలియా జుట్టు విషయంలో కూడా ఇదే తరహా చర్చ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా టెస్టు జట్టులో వార్నర్ కు జోడీగా ఎవరు ఓపెనర్ గా దిగబోతున్నారు అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. వార్నర్ కి జోడి ని సెలెక్ట్ చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా మల్లగుల్లాలు పడుతోంది. సాధారణంగా అయితే గత కొన్నేళ్ల నుంచి వార్నర్ కు జోడిగా జో బర్న్స్  బరిలోకి దిగుతున్నాడు. కానీ ఈసారి మాత్రం ఓపెనింగ్ జోడి లో మార్పులు చేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తోంది.


 ఇటీవలే తన సత్తా చాటుకుని ఎంతగానో సెలక్టర్ల చూపును ఆకర్షించిన యువ సంచలనం విల్  పుకోవ్ స్కీ  నీ వార్నర్ కి జోడిగా బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే దీనిపై ఇటీవల వార్నర్ ను  కూడా అడిగిన విషయం తెలిసిందే. ఓపెనింగ్ జోడిగా తనతో ఎవరూ ఆడిన సమ్మతమేనని.. ఇటీవల కాలంలో తనతో జో బర్న్స్  మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అంటూ చెప్పుకొచ్చాడు.



 అయితే ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు పట్ల కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ వార్నర్ మాటల్లో  తప్పేమీ లేదు.. వార్నర్ ఒక ఆటగాడు మాత్రమే సెలెక్టర్ కాదు అంటూ గుర్తు చేశాడు. తనకు జోడీగా ఎవరు ఆడాలని దానిపై వార్నర్ ఎలా నిర్ణయిస్తాడు.. బోర్డు వ్యవహరించిన తీరు వల్ల వార్నర్ తో ఇతర ఆటగాళ్లకు వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వార్నర్ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అంటూ వ్యాఖ్యానించాడు మైకేల్ క్లార్క్.

మరింత సమాచారం తెలుసుకోండి: