ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు. కరోనా  వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన భారత ఆటగాళ్లు అందరూ కనీసం ప్రాక్టీస్ కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఇటీవలే కఠిన నిబంధనల మధ్య ఐపీఎల్ నిర్వహించింది బిసిసీఐ.  ఐపీఎల్ లో ఎంతో మంది భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఇక ఐపీఎల్ ముగియగానే భారత జట్టు ప్రస్తుతం అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే



 అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతమైన బౌలింగ్ చేసి  ఎంతోమందిని ఆకర్షించాడు నటరాజన్. ఏకంగా తన పదునైన యార్కర్లతో  దిగ్గజ బ్యాట్స్మెన్ లను సైతం అవుట్ చేస్తూ ఐపీఎల్లో సూపర్ స్టార్ గా  నిలిచాడు నటరాజన్. దీంతో నటరాజన్ బౌలింగ్ కి ఫిదా అయిపోయిన బిసిసిఐ సెలెక్టర్లు ఏకంగా భారత జట్టులో స్థానం కల్పించారు అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టులో స్థానం కల్పించారు కానీ తుది జట్టులో స్థానం దక్కుతుందా లేదా అని అనుకున్నారు అందరు. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు సెలెక్ట్ చేసిన యువ ఆటగాళ్లను బెంచ్ కు స్ట్రెంత్ కి  మాత్రమే పరిమితం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 కానీ నటరాజన్ కు మాత్రం అదృష్టం బాగా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే భారత జట్టుకు సెలెక్ట్ అయిన మొదటిసారి తుది జట్టులో స్థానం సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం తుది జట్టులో నటరాజన్ పేరు చేర్చినట్లు ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. నవదీప్ సైని కి వీపు భాగంలో నొప్పి ఉండటం కారణంగా అతనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం నటరాజన్ తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకొని భారత పేసర్ ఇషాంత్ శర్మను జట్టు నుంచి తొలగించినట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ గాయంపై డిసెంబర్ 11న క్లారిటీ వస్తుంది అని బీసీసీఐ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: