ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన లో ఉంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో నే ఆస్ట్రేలియా పర్యటన లో భాగంగా ఇరు జట్ల ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని చాటుకుంటూ ప్రస్తుతం ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా కోచ్ తో పాటు పలువురు ఆటగాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపించారు అనే విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు అయినప్పటికీ క్రీడాస్ఫూర్తి ని చాటుకుంటూ ఉండటం ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది,



 ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీపై  ఏకంగా ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఫించ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బహుశా ఆల్ టైం గ్రేట్ వన్డే క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కావచ్చు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు. 248 వన్డేల్లో 11887 పరుగులు చేశాడని.. సచిన్ తర్వాత వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.. ఈ గణాంకాలు విరాట్ కోహ్లీ వన్డే లో ఎప్పుడు గ్రేటెస్ట్ ప్లేయర్ అని చెబుతున్నాయి అంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ పించ్ ప్రశంసలు కురిపించాడు.



 అయితే ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తమ జట్టుతో తలపడనున్న  నేపథ్యంలో ముందుగా విరాట్ కోహ్లీ వికెట్  పడగొట్టడం పైనే తమ జట్టు  ఎక్కువగా దృష్టి పెట్టింది అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్. కాగా ప్రస్తుతం దాదాపు 9 నెలల తర్వాత టీమిండియా జట్టు మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది అనే విషయం తెలిసిందే. సాధారణంగానే ఆస్ట్రేలియా భారత్ మధ్యన పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో పోటీ జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరి ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: