వెల్లింగ్టన్: న్యూజీల్యాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ క్రికెటర్లకు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం దాదాపు
ఆరుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పుడు మరో క్రికెటర్‌కూ కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్నిన్యూజాల్యాండ్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వచ్చే నెల 18 నుంచి ప్రారంభం కానున్న న్యూజీల్యాండ్ సిరీస్ కోసం ఈ నెల
24న పాకిస్తాన్ ఆటగాళ్లు న్యూజీల్యాండ్ చేరుకున్నారు. ఈ సిరీస్‌లోభాంగంగా పాక్ న్యూజీల్యాండ్‌తో 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.


అయితే క్వారంటైన్ నిబంధనల్లో భాగంగా వారందరికీ కరోనా టెస్టులు చేయడంతో
ఆరుగురు ఆటగాళ్లకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో షాకయిన న్యూజీల్యాండ్
క్రికెట్ బోర్డు వెంటనే వారందరినీ హోటల్ గదుల నుంచి బయటకు రావద్దని
ఆదేశించింది. కరోనా బారిన పడినవారికి చికిత్స అందించడం ప్రారంభించింది.


 మిగతా ఆటగాళ్లకు కూడా పరీక్షలు నిర్వహించింది. దీంతో ఈ రోజు(శనివారం) మరో ఆటగాడికి కూడా కరోనా ఉన్నట్లు బయటపడింది. ఆటగాళ్లందరూ క్రైస్ట్‌చర్చ్‌లోని హోటల్ గదికే పరిమితమయ్యారు. న్యూజీల్యాండ్ నిబంధనల ప్రకారం ఎవరైనా కరోనా బారిన పడితే కనీసం రెండు వారాల పాటు నిర్బంధంలో గడపాలి. పాక్ క్రికెట్ జట్టు హోటల్‌లో సామాజిక దూరం పాటిస్తూ నిర్బంధంలో ఉండాలని న్యూజిలాండ్ వైద్యాధికారులు కోరారు. అయితే కరోనా సోకిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు సభ్యులు కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని,
దీన్ని తీవ్రంగా పరిగణించి పాక్ జట్టుకు తుది హెచ్చరిక జారీ చేశామని న్యూజిలాండ్ వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్  చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: