ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా కు నిరాశే ఎదురైంది అన్న విషయం తెలిసిందే.  మొదట సిరీస్ గెలిచి తమ సత్తా చాటాలని అనుకున్న టీమిండియాకు వరుసగా రెండు ఓటమిలు  చవి చూడటం తో వన్డే సిరీస్ కాస్తా చేజారి పోయింది ఈ క్రమంలోనే టీమిండియాకు ఊహించని విధంగా షాక్ తగిలింది. ముఖ్యంగా భారత బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో ఆస్ట్రేలియా బ్యాట్మెన్స్  చెలరేగి ఆడటంతో రెండు మ్యాచ్ లలో కూడా భారీ స్కోరు చేయగలిగింది. దీంతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే టీమిండియా ఓటమిపై ప్రస్తుతం ఎంతో మంది అభిమానులు నిరాశతో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతం గా రాణిస్తుంది అనుకున్న సమయంలో టీమిండియా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది.



 అయితే మొదటి మ్యాచ్ లో  క్రీజులోకి  వచ్చి అద్భుతంగా రాణించి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యా ఇక రెండో మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తారు అనుకున్న సమయంలో హార్థిక్ పాండ్య  అందరి నిరాశపరిచాడు అనే విషయం తెలిసిందే.  తక్కువ పరుగులకే  వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరాడు అయితే ఇటీవలే వన్డే సిరీస్ చేజార్చుకోవడం పై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు మొదట లక్ష్య ఛేదనలో శుభారంభం పొందినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకోవడంతో లక్ష్యాన్ని ఛేదించడం కష్టతరంగా మారింది అంటూ చెప్పుకొచ్చాడు.



 అయితే భారత ఆల్ రౌండర్ హార్థిక్ పై  తాను ఎంతగానో నమ్మకాన్ని పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ 10 ఓవర్లలో 100 పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయం అందిస్తాడు అని అనుకున్నాను కానీ హార్దిక్ పాండ్యా తక్కువ పరుగులకే ఏడు వికెట్ కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది అంటూ చెప్పుకొచ్చాడు. 40 ఓవర్ల వరకు కె.ఎల్.రాహుల్ తాను క్రీజు లోనే ఉండి ఉంటే బాగుండేది అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. తరువాత మ్యాచ్ లలో పుంజుకొని మరింత బాగా ఆడటానికి ప్రయత్నిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: