టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో మొదటి వన్డే సిరీస్ ప్రారంభించింది టీమిండియా. కానీ మొదటి వన్డే సిరీస్లో ఊహించని షాక్ తగిలింది. భారత జట్టు అన్ని విభాగాల్లో విఫలం  అవడంతో ఇక ఆస్ట్రేలియా రెండు  మ్యాచ్ లలో  ఘన విజయాన్ని సాధించి సిరీస్ దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 9 నెలల తర్వాత మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు అద్భుతంగా రాణించి సిరీస్ కైవసం చేసుకుంటుంది అని భారత ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.. కానీ భారత ప్రేక్షకులందరికీ నిరాశ ఎదురైంది అని చెప్పాలి.




 ఈ క్రమంలోనే కోహ్లీసేన కు ఊహించని విధంగా రెండు వన్డే మ్యాచ్ లలో కూడా పరాజయం పాలు కావడంతో ఇక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్  చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. రెండు వన్డే మ్యాచ్ లలో  కూడా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేయడంతో టీమిండియాకు లక్ష్య ఛేదన ఎంతో కష్టతరంగా మారిపోయింది. దీంతో భారీ టార్గెట్ ను చేధించేందుకు ఎంతగానో టీమిండియా ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి ఓటమి చవిచూసింది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై భారత బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 తాజాగా వన్డే మ్యాచ్లో ఓటమి పై ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లు విఫలం కావడం వల్లే భారత జట్టు ఓడిపోయింది అంటూ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు పూర్తిగా తేలిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది అంటూ తెలిపిన విరాట్ కోహ్లీ.. ప్రత్యర్థి ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కొంతవరకు ఛేదన  బాగానే జరిగినప్పటికీ ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు పుంజుకోవడంతో కష్టతరంగా మారింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: