సాధారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఎంత మంది అభిమానులు ఉంటారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత క్రికెట్ ప్రేక్షకుల లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఎప్పుడూ తన ఆటతో ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే ప్రత్యర్థి జట్టు లో కూడా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. చిన్నారులపై విరాట్ కోహ్లీ  ప్రభావం ఎంతగానో ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు మైకెల్ వాన్.



 తన కొడుకు విరాట్ కోహ్లీ కి వీరాభిమాని అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రమే తన కొడుకు మ్యాచ్ వీక్షిస్తూ ఉంటాడని విరాట్ కోహ్లీ క్రికెట్వికెట్ పడిపోగానే మళ్ళీ టీవీ కట్టేసి తన పని తాను చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ . బ్యాటింగ్  విషయంలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడని... క్రికెట్ చరిత్రలోనే అతడే ఒక ప్రత్యేకమైన ఆటగాడు అంటూ ప్రశంసలు కురిపించారు.




 మంచి నిద్రలో ఉన్న తన కొడుకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగితే నన్ను నిద్ర లేపు అంటూ చెప్పాడని  ఆ తర్వాత విరాట్ కోహ్లీ మిడ్  వికెట్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో వెంటనే కోహ్లీ అవుట్ కాగానే వెంటనే టీవీ చూడడం ఆపేసి తన పని తాను చేసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్. ఇలా విరాట్ కోహ్లీ ప్రభావం చిన్న పిల్లలకు ఎంతగానో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ లేకుండా ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా తలపడడం అంటేనే ఆందోళన కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ లేకుండా భారత్ టెస్ట్  గెలుస్తుంది అని మాత్రం తాను అనుకోవడం లేదు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: