భారత జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కి భారత క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఎప్పుడైనా బరిలోకి దిగాడు అంటే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు. భారీగా సిక్సర్లు బాదుతూ  బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు రోహిత్ శర్మ. భారీ స్కోరు చేయడం లో రోహిత్ శర్మ దిట్ట అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో ఒత్తిడిలో కూడా ఎంతో కూల్గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు రోహిత్ శర్మ. అయితే ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక కాలేదు అనే విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కేవలం టెస్ట్ సిరీస్ కోసం మాత్రమే ఎంపిక అవ్వగా టి20 లకు ఎంపిక అవ్వలేదు. ఐపీఎల్లో గాయం బారిన పడిన రోహిత్ శర్మ... పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేని కారణంగా బీసీసీఐ రోహిత్ శర్మ వన్డే టి20 లకు ఎంపిక చేయలేదు అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ లేకుండానే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు వన్డే టి20 సిరీస్ లు  ఆడుతుంది. ఇక ఇటీవలే భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో సిరీస్ చేజార్చుకుంది భారత జట్టు.



 అయితే భారత జట్టులో ప్రస్తుతం రోహిత్ శర్మ ఆడక పోయినప్పటికీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు రోహిత్ శర్మ. వన్డేల్లో వరుసగా ఎనిమిదో ఏడాది భారత జట్టు తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇదే ఏడాది జనవరి 19వ తేదీన ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 119 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత ఏ ఆటగాడు కూడా వంద పరుగులు కూడా చేరుకోలేదు ఇక ఇటీవల జరిగిన వన్డే లో కూడా ఏ ఆటగాడు 100 పరుగులు చేయలేదు. దీంతో రోహిత్ శర్మ ప్రస్తుతం భారత జట్టులో ఆడక పోయినప్పటికీ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2013 నుంచి 2020 వరకు ప్రతి ఏడాది అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆటగాడిగా మరో సరికొత్త రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: