ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు మొదటి వన్డే సిరీస్ లో  ఘోరంగా విఫలం అయింది అన్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలల తర్వాత మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు మొదటి వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించి సిరీస్ కైవసం చేసుకుంటుంది అని అందరూ అనుకుంటే ఇక మొదటి వన్డే మ్యాచ్లలో ఘోర ఓటమి చవిచూసింది. భారీ పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి వన్డే సిరీస్లో భారత జట్టు అన్ని విభాగాల్లో కూడా పూర్తిగా విఫలం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే మొదటి రెండు వన్డేల్లో  ఓడిపోయి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ టీమిండియా చేజార్చుకున్న నేపథ్యంలో టీమిండియాపై పలువురు విమర్శలు గుప్పించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాధారణంగానే కోహ్లీ పై విమర్శలు గుప్పించే గౌతం గంభీర్ 2 వన్డే మ్యాచ్ లలో  ఓడిపోవడంపై  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో భారత ఓటమి కేవలం విరాట్ కోహ్లి కెప్టెన్సీ వైఫల్యం అంటూ గౌతం గంభీర్ విమర్శలు గుప్పించాడు.



 దీంతో అటు కోహ్లీ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇటీవలే కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు గౌతం గంభీర్. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో 63 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అతి తక్కువ వన్డే మ్యాచ్లలో 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న  ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే తాజాగా దీనిపై స్పందించిన గౌతం గంభీర్... ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో స్పందించిన వివిఎస్ లక్ష్మణ్.. కోహ్లీ 12 వేల పరుగులు చేయడం అసాధారణం ప్రతి సిరీస్లో అతను ఆడే విధానం అద్భుతం.. ప్రతిరోజూ ఒకే తీవ్రతతో ఆడుతాడు కోహ్లీ.. తన ఆటతీరు నమ్మశక్యంగా లేదు అంటూ వి.వి.ఎస్.లక్ష్మణ్ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: