ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో వన్డే టి20 టెస్ట్ సిరీస్ లు  ఆడనుంది  భారత జట్టు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టుతో మొదటి వన్డే సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి వన్డే సిరీస్ టీమ్ ఇండియా చేజార్చుకుంది. ప్రస్తుతం తొలి టి20 సిరీస్ నిన్న ప్రారంభమైంది. టి20 సిరీస్లో విజయం సాధించింది టీమిండియా. అయితే గత కొంత కాలం నుంచి అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణించి పరుగుల వరద పారించాడు కేఎల్ రాహుల్.




 ఇక ఇప్పుడు కూడా టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోయి ఓపెనర్గా బరిలోకి దిగి  అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి 20 మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ కె.ఎల్.రాహుల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్సులో 1500 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు.  కేవలం 39 ఇన్నింగ్స్ లోనే 1500 పరుగులు చేసి విరాట్ కోహ్లీ బాబర్ అజామ్  ఫించ్ సరసన చేరిపోయాడు కె.ఎల్.రాహుల్.  బాగా నిన్న జరిగిన భారత్-ఆస్ట్రేలియా మొదటి టి20 మ్యాచ్ లో కె.ఎల్.రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగి  50 పరుగులు చేశాడు. ఇలా ప్రస్తుతం కె.ఎల్.రాహుల్ కెరియర్ పీక్స్ లో కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే.



 దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి కేఎల్ రాహుల్ ఆడుతున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగానే కె.ఎల్.రాహుల్ ఒక టెక్నికల్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ఎంతో టెక్నిక్ తో బాల్ ని సిక్సర్ గా మలచగల నైపుణ్యం కేఎల్ రాహుల్ సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరింత మెరుగు పరుచుకుని కేఎల్ రాహుల్ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ... టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఈ క్రమంలోనే ప్రస్తుతం రోహిత్ శర్మ లేకపోవడంతో... టీమ్ ఇండియా'కు వైస్ క్యాప్టెన్ హోదాను కూడా కె.ఎల్.రాహుల్ సాధించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: