ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో బెస్ట్ క్రికెటర్, కెప్టెన్ ఎవరు..? ఈ ప్రశ్నపై ఐసీసీ మంగళవారం ఓ ఆన్‌లైన్ సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించింది. దీని ద్వారా ప్రజల అభిప్రాయంలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంది. అయితే ఈ పోల్‌లో భారత్ నుంచి షాకింగ్ ఓటింగ్ నమోదైంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకంటే పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు అధికశాతం ఓటింగ్ పడింది. దీనిక పాకిస్తాన్‌లోని క్రికెట్ అభిమానులు ఓటింగ్ మాత్రమే కారణం అనుకోకండి. భారతీయ క్రికెట్ అభిమానులు కూడా అనేకమంది ఇమ్రాన్ ఖాన్‌కే ఓటేశారు.

ఐసీసీ నిర్వహించిన పోల్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్, న్యూజిల్యాండ్ మహిళా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్లను తన పోల్‌లో ఉంచింది. 5 లక్షల ఓట్లు వచ్చిన తరువాత పోల్ వివరాలను ఐసీసీ వెల్లడించింది. అయితే ఈ పోల్ ఫలితాల్లో విరాట్ కోహ్లీకి 46.2 శాతం ఓటింగ్ రాగా, ఇమ్రాన్ ఖాన్‌కు 47.3 శాతం ఓటింగ్ లభించింది. ఇక డివిలియర్స్‌కు 6 శాతం, మెగ్ లానింగ్‌కు కేవలం 0.5 శాతం ఓటింగ్ మాత్రమే లభించింది.

ఈ విధంగా ఇమ్రాన్ ఖాన్‌కు అధికశాతం ఓట్లు రావడానికి భారతీయులు కూడా కారణం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే దీనికి వారు చెప్పిన కారణం ఏంటో తెలుసా..? తమకు దేశ ప్రధాని మోదీ అంటే ఇష్టం లేదట. రాజకీయాలను, క్రీడలను కలుపుతున్నందుకు ఆవేదనగా ఉన్నా.. తాను ఇమ్రాన్ ఖాన్‌కే ఓటేస్తున్నానని డాక్టర్ సయ్యడ్ ఉజ్మా అనే మహిళ ట్వీట్ చేసింది. అంతేకాదు ఇమ్రాన్ పాకీస్తాన్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాడని, క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం, దేశంలోని మైనారిటీలకు అక్కడి ప్రభుత్వం అందిస్తున్న రక్షణ వంటి అంశాలను ఆధారంగా చేసుకునే ఇమ్రాన్ ఖాన్‌కు ఓటేశానని ఆమె రాసుకొచ్చింది.

అంతేకాదు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి నిర్వహిస్తున్న ఐటీ సెల్ ‘టీం బన్’లోని ట్విటర్ యూజర్ల ద్వారా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కే ఓటేసినట్లు తెలుస్తోంది. టీం బన్ నుంచి దేశవ్యాప్తంగా బీజేపీపై దూషణలు చేస్తూ, హిందువులపై అసభ్యకర వ్యాఖ్యలు బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ట్విటర్‌ బోట్‌లతో సోషల్ మీడియాలో స్పామ్ చేశారని, మోదీపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో విరాట్ కోహ్లీకి కాకుండా టీం బన్ సభ్యులు అనేకమంది ఇమ్రాన్ ఖాన్‌కు ఓటేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను టీం బన్ ఖండిస్తోంది. దీపావళికి క్రాకర్స్ కాల్చవద్దని చెప్పినందుకే కోహ్లీకి ఓట్లు వేయకుండా ఇమ్రాన్ ఖాన్‌కు ఓట్లు వేశారని చెప్పుకొస్తోంది.

ఇక ఇమ్రాన్ ఖాన్ అసలే పాకిస్తాన్ ప్రధాని.. ఆయన తలచుకుంటే సాధ్యం కానిది ఏమైనా ఉందా..? ప్రత్యేకంగా ట్విటర్ బోట్లు పెట్టి మరీ తనకు ఓటింగ్ వేయించుకున్నట్లు, ట్విటర్‌ను పూర్తిగా స్పామ్ చేసినట్లు సమాచారం అందుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: