బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్నా మూడవ టెస్ట్ లో తెలుగు తేజం హనుమ విహారి ఎలాంటి ప్రదర్శన చేశాడో అందరికీ తెలిసిందే. వరుసగా టాప్ బ్యాట్స్ మెన్స్ విఫలమౌతున్న క్రమంలో ప్రత్యర్థి జట్టు వైపు విజయం మొగ్గు చూపుతున్న సమయంలో  జట్టును రక్షించేందుకు చివరి రోజున హనుమ విహారి చూపించిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ వైపు గాయం ఇబ్బంది పెడుతున్న నొప్పిని భరిస్తూ ప్రత్యర్థి జట్టుకే చమటలు పట్టించి అతను 161 బంతులు ఆడాడు. విహారి ఈ అద్బుతమైన ప్రదర్శనతో మ్యాచ్ ఫలితన్నే మార్చేసి డ్రా గా ముగించాడు. 

దీంతో విహారి పట్టుదలపై యావత్ క్రికెట్‌ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. అయితే కేంద్ర మంత్రి, మాజీ గాయకుడు బాబుల్‌ సుప్రియో మాత్రం ఒక వ్యతిరేక వ్యాఖ్యతో తీవ్ర దుమరాన్ని రేపాడు. "7 పరుగులు చేసేందుకు 109 బంతులా... ఇంత ఘోర ప్రదర్శనతో క్రికెట్‌ను చంపేసి భారత జట్టు చారిత్రక విజయం సాధించే అవకాశాన్ని హనుమ 'బిహారి' పోగొట్టాడు. ఇది పెద్ద నేరం’ అంటూ ట్వీట్‌ చేశాడు. బాబుల్ సుప్రియో చేసిన ఈ ట్వీట్ పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సుప్రియో అజ్ఞానాన్ని అందరూ కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే దీనికి హనుమ విహారి ఒకేఒక్క ట్వీట్ తో స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు. బాబుల్ సుప్రియో తన పేరు "బిహారీ " అంటూ తప్పుగా రాయడాన్ని చూపిస్తూ " హనుమ విహారి ' అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ ఒక్క ట్వీట్ తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది.  దీనికి సుమారు 61 వేల లైక్‌లు రాగా... సహచరుడు అశ్విన్‌ కూడా "రూల్ఫ్ మ్యాక్స్ " అంటూ పడిపడి దొర్లి నవ్వుతున్నట్లు ట్వీట్‌ చేశాడు. ఇంకా సెహ్వాగ్ లాంటి వారు కూడా విహారి కి అనుకూలంగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: