టి20 మ్యాచ్ అనగానే ధనాదన్ బౌండరీలతో,మెరుపు సిక్స్ లతో ఆటగాళ్ల అగ్రెసివ్ ప్రదర్శనతో సిసలైన క్రికెట్ మజాను పంచుతుంది. అందుకే టి 20 మ్యాచ్ లపై ఆటగాళ్లు మరియు క్రికెట్ యజమాన్యం ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. క్రికెట్ అభిమానులు కూడా టి 20 మ్యాచ్ లు అనగానే భారీ సంఖ్యలో స్టేడియాన్ని చేరుకుంటారు.టి 20 ప్రారంభం అయిన తరువాత వన్డే, టెస్ట్ సిరీస్ లకు ఆధరణ తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 దేశవాళీ క్రికెట్ టోర్నీ " ఐ‌పి‌ఎల్ " ప్రపంచ వ్యాప్తంగా అంతా ప్రాచుర్యం పొండడానికి టి20 మ్యాచ్ కావడం వల్లనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఈ టి20 మ్యాచ్ లలో రికార్డ్ లకు కొదువే ఉండదు. తాజాగా దేశవాళీ క్రికెట్ అయిన ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో మేఘాలయ కెప్టెన్‌ పునీత్‌ బిష్త్ రికార్డ్ సృష్టించాడు.‌ మిజోరాం తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 17 సిక్సర్లతో 146 పరుగులు చేసి టి20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు.

గతంలో ఈ రికార్డ్ శ్రేయస్‌ అయ్యర్ పేరు మీదుగా వుండేది. అయ్యర్‌ అత్యధికంగా 15 సిక్సర్లు కొట్టాడు. అయితే ఇప్పుడు అతన్ని అదిగమించి పునీత్ బిష్త్ 17 సిక్సులతో  నిలిచాడు. అయితే ఓవరాల్‌గా ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు మాత్రం వెస్టిండీస్ విద్వంసక ఆటగాడు  క్రిస్‌ గేల్‌ (18) పేరిట ఉంది. అతని తరువాతి స్థానంలో టీమిండియా ఆటగాడు ఉండడం విశేషం. మేఘాలయ 230 పరుగులు సాధించగా, 100 పరుగులు మాత్రమే చేయగలిగిన మిజోరాం 130 పరుగుల తేడాతో చిత్తయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: