క్రికెటర్ లలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే వాళ్ళలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ప్రతి చిన్న విషయంపై కూడా ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఉంటారు. కొన్నిసారు సెహ్వాగ్ చేసే వ్యాఖ్యలు సంచలనం రేపితే కొన్ని సారు చలోక్తులతో హాస్యాన్ని పండిస్తాయి. ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా టీమిండియా ఆటగాళ్లు టెస్ట్ సిరీస్ అటుతున్న సంగతి తెలిసిందే. వరుస గాయాలతో టీమిండియా ఆటగాళ్లు జట్టుకు దూరమౌతున్న తరుణంలో సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.

 " జట్టు గాయాలతో కాలి అవ్వడం చూడలేక పోతున్న అందుకే నేను ఫ్లైట్ ఎక్కి వస్తున్నా " అంటూ ట్విటర్ వేదికగా టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భాగ వైరల్ అయ్యాయి. తాజాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో కేరళ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ విరోచిత సెంచరీ చేసి విజయాన్ని అందించాడు. దీంతో అజహరుద్దీన్‌ బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్ ఈ‌ కేరళ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ బ్యాటింగ్ శైలిని కొనియాడారు. 

ముంబయి లాంటి గొప్ప జట్టుపై ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం సాధారణ విషయం కాదన్నాడు. అజహరుద్దీన్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడని సెహ్వాగ్ తెగ మెచ్చుకున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ (54 బంతుల్లో 137 నాటౌట్‌; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు ప్రదర్శనతో కేరళ జట్టు 8 వికెట్లతో అద్బుత విజయం సాధించింది. ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 196 పరుగులు చేయగా... అజహరుద్దీన్‌ విద్వంసక ఇన్నింగ్స్ తో కేరళ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: