బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో బ్రేస్బేన్ లోని గబ్బా వేధికగా భారత్ - ఆసీస్ జట్ల మద్య చివరి టెస్ట్ ప్రారంభం అయ్యింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి రోజు భారీ స్కోర్ నే నమోదు చేసింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో కీపర్ గా రిషబ్ పంత్ కు అనుకోని పరాభవం ఎదురైందనే చెప్పాలి. నటరాజన్‌ వేసిన 84 ఓవర్‌ మూడో బంతిని ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ఎదుర్కొన్నాడు. ఆ బంతి కాస్త స్వింగ్‌ అవుతూ బ్యాట్ కు తగలకుండా నేరుగా వికెట్‌ కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. వెంటనే పంత్ ఔట్‌ కోసం అప్పీల్‌ చేశాడు. 

అయితే పంత్ అప్పీల్ పై సహచర ఆటగాళ్లు ఎవరు స్పందించలేదు. అంతేకాక ఎంపైర్ కూడా ఏవిధమైన సమాధానం ఇవ్వలేదు. అయినప్పటికి పంత్  కనీసం డీఆర్‌ఎస్‌ కోరదామని కెప్టెన్‌ రహానేను కోరగా దానికి రహనే నవ్వి వదిలేశాడు. ఇక స్లిప్‌ల్లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌, పుజారా  కూడా నవ్వి ఊరుకున్నారు. దీనికి పంత్‌ చాలా నిరాశకు గురై అసహనం తో వెనుదిరిగాడు. అయితే రిషబ్ పంత్ ప్రత్యర్థి ఆటగాళ్లు ఔట్‌ విషయంలో కాస్త తడబడుతున్నాడనే చెప్పాలి.
 
ఒకప్పుడు కీపర్ గా ఉన్న ఎం‌ఎస్ ధోని ఔట్ విషయమై అప్పీల్ చెయ్యడంలో కచ్చితత్వం ఉండేది. అలాగే  డీఆర్‌ఎస్‌ విషయంలో కానీ, స్టంపింగ్‌లో కానీ ధోనిది ప్రత్యేక శైలి. మరి ధోని వారసుడిగా వచ్చిన యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ మాత్రం కచ్చితత్వంలో విఫలం అవుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు..ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కొందరు పంత్ "ఇంకా చాలా నేర్చుకోవాలి" అంటూ కామెంట్స్ పెడుతుంటే మరికొందరు.. ఆటగాళ్లు స్పందించక పోవడం పై విమర్శలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: