బీసీసీఐ  ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది. అంతకంతకూ ఐపీఎల్ క్రేజ్ పెరిగిపోతునే  ఉంది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే గత ఏడాది ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తినప్పటికీ ఇక గత ఏడాది చివర్లో భారత్లో కాకుండా యూఏఈ వేదికగా బయోసెక్యూర్ బబుల్ పద్ధతిలో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఐపీఎల్ ఎంతో అద్భుతంగా సాగింది.


 ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో అవకాశం దక్కించుకుని తమ సత్తా చాటారు. ఇకపోతే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది.  ఇకపోతే ఈ  ఏడాది ఐపీఎల్ నిర్వహణ కోసం ఇప్పటికే బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది.  ఏడాది చివరలో కాకుండా వేసవిలోనే ఐపీఎల్ నిర్వహించాలి అని అటు బీసీసీఐ  భావిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టిన బీసీసీఐ.. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే జనవరి 21 లోగా ప్రాంఛైజీలు అన్నీ కూడా తమతో కొనసాగే ఆటగాళ్ల వివరాలు సమర్పించాలి అంటూ కోరింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా జట్లు తమ జట్టు నుంచి వదిలేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.



 అంతేకాకుండా ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఏ జట్టు లో కూడా భాగం అవ్వని ఆటగాళ్లు ఫిబ్రవరి 4 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇక ఆటగాళ్లందరూ తమ దరఖాస్తులను ఫిబ్రవరి 12 లోగా గవర్నింగ్ కౌన్సిల్ కు పంపాలని సూచించింది. ఇక ప్రస్తుతం బిసిసిఐ నిర్వహించ తలపెట్టిన మినీ వేలం లో పాల్గొనాలి అంటే ఆటగాళ్లందరూ ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లో తప్పనిసరిగా సభ్యత్వం కలిగి ఉండాలి.  అంతేకాకుండా ప్రతి ఒక్క ఆటగాడు ఫస్ట్ క్లాస్ లేదా క్లాస్ ఏ లో ఒక్క మ్యాచ్ అయినా ఆడి  ఉండాలి అంటూ నిబంధన పెట్టింది బీసీసీఐ.

మరింత సమాచారం తెలుసుకోండి: