ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఆస్ట్రేలియా జట్టుతో వరుసగా సిరీస్ లు ఆడుతుంది భారత జట్టు ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు..  ఇక అక్కడ బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో ఆస్ట్రేలియా జట్టుతో వరుసగా సిరీస్ లు  ఆడుతుంది అనే విషయం తెలిసిందే .  ఈ క్రమంలోనే ఇప్పటికే వన్డే టి20 సిరీస్ లు  ఆడిన  భారత జట్టు ప్రస్తుతం కంగారు జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఇప్పటికే జరిగిన వన్డే టి20 సిరీస్ లలో  ఇరు జట్లు కూడా చెరొక సిరీస్ కైవసం చేసుకున్నాయి.  ఈ క్రమంలోనే కరోనా  వైరస్ తర్వాత భారత్ వెళ్ళిన మొదటి అంతర్జాతీయ పర్యటనలో ఎవరు ఆధిపత్యం సాధిస్తారు  అనేది టెస్ట్ సిరీస్ ద్వారా తేలనుంది.



 ఈ క్రమంలోనే  టెస్టు సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక మూడవ మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరగ్గా చివరికి డ్రాగా ముగిసింది. ఇక ఇటీవల భారత్ ఆస్ట్రేలియా మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే భారత జట్టులోకి గాయం బారి నుంచి కోలుకుని ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ పై భారత జట్టు యాజమాన్యం భారీగా ఆశలు పెట్టుకుంది అనే విషయం తెలిసిందే.



 కానీ మూడో మ్యాచ్లో రోహిత్ శర్మ ఎక్కువగా ప్రభావితమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు.  ఇక ఇటీవలే నాలుగవ మ్యాచ్ లో కూడా ఇలాంటి తరహా బ్యాటింగ్  తో అందరిని నిరాశపరిచాడు. గ్రౌండ్ లోకి వచ్చి రాగానే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ భారీ స్కోరు దిశగా వెళ్తాడు అని అందరూ అనుకున్నారు. కొన్ని పరుగులకే అవుట్ అయ్యాడు. ఇటీవలే తాను అవుట్ కావడం పై స్పందించిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో పరుగులు తీయడం చాలా కష్టం.. ఎవరో ఒకరు ముందుకు వచ్చి బౌలర్లపై తప్పనిసరిగా ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది ఆ పని తాను చేశాను.. కానీ దురదృష్టవశాత్తు బాల్ సరిగా కనెక్ట్ చేయకపోవడంతో అవుట్ కావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు అంటూ రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: