గత ఏడాది జరిగిన ఐపిఎల్ లో అద్భుతంగా సత్తాచాటిన వాషింగ్టన్ సుందర్ ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ లో  భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే బౌలింగులో అద్భుతంగా రాణించిన వాషింగ్టన్ సుందర్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టడమే  కాదు ఆటగాళ్లను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విజయం సాధించాడు. అదే సమయంలో ఇటీవలే నాల్గవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో... వాషింగ్టన్ సుందర్ ఆడిన  ఇన్నింగ్స్ అద్భుతం అనే చెప్పాలి.



 ఒక బౌలర్ అయినప్పటికీ కీలక బ్యాట్ మెన్ పెవిలియన్ చేరి జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. ఎంతో బాధ్యత తీసుకొని యువ ఆటగాడు అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడి లాగా మైదానంలో నిలకడగా రాణిస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ప్రశంసలు అందుకున్నాడు వాషింగ్టన్ సుందర్.  ఈ క్రమంలోనే యువ ఆటగాడు ప్రతిభపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అన్న విషయం తెలిసిందే. అంతే కాదు భారత క్రికెట్లో ప్రస్తుతం యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ పేరు మార్మోగిపోతోంది. ఇక ఈ యువ ఆటగాడు పై ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లో సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


 ఇదిలా ఉంటే సాధారణంగా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ పేరు వినగానే అందరిలో ఒక డౌట్ వస్తుంది.  వాషింగ్టన్ సుందర్ ఏంటి పేరు కొత్తగా ఉంది..  అసలు ఈ పేరు ఎలా వచ్చింది అనే ప్రశ్న ప్రతిఒక్కరిలో తలెత్తి ఉండవచ్చు. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. వాషింగ్టన్ సుందర్ వాళ్ళ నాన్న  M.సుందర్.. ఆయన కూడా ఒక మంచి క్రికెటర్. పేదరికం వల్ల క్రికెట్ ఆపగా.. అతని ప్రతిభను గుర్తించిన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పిడి. వాషింగ్టన్ అనే వ్యక్తి అతనికి ఆర్థిక సహాయం చేస్తూ క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించాడు. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయి వరకు వచ్చాడు వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం. సుందర్.  ఈ క్రమంలోనే తనకు సహాయం చేసిన వ్యక్తిపై కృతజ్ఞతతో తన మొదటి సంతానానికి వాషింగ్టన్ సుందర్ అనే పేరు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: